Tuesday, April 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. మృత్యువు అంటే ఏమిటి? (ఆడియోతో..)

మనిషి అంటే అతడు కేవలం మానవ శరీరం మాత్రమే కాదు. అతడు రక్త మాంసాలతో తయారైన శరీరాన్ని కలిగి ఉండటమే కాక చైతన్య శక్తి అయిన ఆత్మను కూడా కలిగి ఉన్నాడు. ఈ శరీరం కలిగి ఉండటమే కాక చైతన్య శక్తి అయిన ఆత్మను కూడా కలిగి ఉన్నాడు. ఈ శరీరం క్షీణిస్తుంది. శిథిలమవుతుంది కనుక నశ్వరమైనది. కానీ ఆత్మ అశ్వరమైనది, ఆత్మను ఖండించలేము, కాల్చలేము, తడపలేము. ఆత్మకు శరీరం ఒక గృహమువంటిది, ఒక ఆభరణము వంటిది, ఒక రూపమును ఇచ్చువంటిది. ఒక వస్త్రాన్ని ఎక్కువ కాలం వాడినప్పుడు ఆ వస్త్రం యొక్క జీవితకాలం పూర్తవుతుంది. అప్పుడు మనిషి ఆ వస్త్రాన్ని తీసేసి క్రొత్త వస్త్రాన్ని ధరిస్తాడు. అలాగే ఆత్మ తన కర్మలన్నింటినీ దేహ అంగముల ద్వారా చేస్తుంది. ఈ శరీరము అనే వస్త్రము ద్వారా పాత్రను నిర్వర్తించడం అయి పోయిన తర్వాత ఆత్మ మరో వస్త్రాన్ని అనగా క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరమును మార్చే ఆ నియమాన్నే మృత్యువు అని అంటారు. ఈ పద్ధతి అతి సహజమైన పద్ధతి. ఈ పద్ధతిలో ఆత్మ వదిలేసిన శరీరము నశిస్తుంది.
ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు, ఆ శరీరం ద్వారా చేసే ప్రతీ మంచి – చెడు కర్మల ప్రభావము ఆ ఆత్మపైనే పడుతుంది. ఈ ప్రభావాన్నే సంస్కారాలు అని అంటారు. అంటే ఆత్మ ఒక శరీరాన్ని వదిలేటప్పుడు ఆది ఆ శరీరం ద్వారా చేసిన కర్మల అనుసారంగా దానిలో సంస్కారాలను నింపుకుంటుంది. ఈ సంస్కారాల ఆధారంగానే ఆత్మ క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. అనగా క్రొత్త జన్మ తీసుకుంటుంది. కనుక మన జీవితం సుఖ శాంతులతో నిండిన ఆనందభరిత జీవితమూ లేక కష్టాలు, నష్టాలు, బాధలమయమా అన్నది మన గత కర్మల పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మృత్యువు తర్వాత శరీరం నశిస్తుంది, ఆత్మ అమరమైనది అని తెలుసుకున్నాం. కనుక ఆత్మ తనతో పాటు కర్మల ప్రభావాన్ని అనగా సంస్కారాలను తీసుకువెళుతుంది. ఇలా ఆత్మ జనన మరణ చక్రంలోకి వస్తుంది. అంటే ఆత్మ ఒక శరీరాన్ని తీసుకుని దానిని వదిలేస్తుంది. మళ్ళీ శరీరాన్ని తీసుకుంటుంది… ఇలా కొనసాగుతూ ఉంటుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement