Friday, March 29, 2024

బ్రహ్మాకుమారీస్‌.. నిశ్చింత జీవితానికి సువర్ణ సిద్ధాంతములు (ఆడియోతో..)

స్మృతి : ”నేను సర్వగుణాలు మరియు సర్వకళలతో సంపన్నాత్మను.”
లక్ష్యం : నేను చిన్న పెద్ద కరమలు సర్వోత్తమ విధానతో చేయాలి. పూర్తి సంలగ్నతతో చేయాలి. (కార్యంలో సఫలత నిరంతరం మనము ముందుకు సాగిపోయే ఉత్సాహం ఇస్తుంది. కావున చిన్న పెద్ద ప్రతి పని చాలా శ్రద్ధగా ప్రేమతో చేయాలి. నా సఫలతయే నాకోసం ప్రశంసా పత్రము)(తమ సంపూర్ణ స్వరూపం జ్ఞాపకం పెట్టుకోండి)
చింతన : శ్రీ లక్ష్మీ శ్రీనారాయణుడు సత్యయుగ ప్రపంచంలో విశ్వమహారాజు, విశ్వ మహారాణి.. సర్వగుణాలు, సర్వకళలతో సంపన్నంగా.. సంపూర్ణ నిర్వకారి దేవతలు దే నా ఆత్మ యొక్క ఆది స్వరూపం.. సత్యయుగం మొదలుకొని కలియుగం వరకు అనేక జన్మలు తీసుకుంటూ ఆత్మలోని ఆదిగుణాలు కనుమరుగైపోయాయి. ఇపుడు మరల నాకు ఈ విషయం జ్ఞాపకం వచ్చినది.. నేనే ఆది సుఖ, శాంతి, పవిత్రతో కూడి సంపన్నాత్మను.. నేనే ఆది దేవతా స్వరూపాన్ని… సర్వోత్తముడను.. సర్వశ్రేష్టుడను… సర్వ గుణ సంపన్నుడను.. సర్వకళా సంపన్నాత్మను.. ఇపుడు నా ప్రతికర్మ నాగుణాలు, కళలు సాక్షాత్కారమవుతున్నవి.. నా ప్రతి కార్యంలో ఆ దేవతల వంటి తేజస్సు ప్రకాశం శోభ కనిపిస్తున్నది.. కర్మలలో సర్వోత్తమమైన సహజమైన లక్ష్యం నాది.
అభ్యాసం : ఈ రోజంతా ప్రతి పని చేస్తూ నేను ప్రతి కర్మ శ్రద్ధాపూర్వకంగా సంలగ్నతతో సంపన్నంగా చేయాలి. ప్రతి ఒక్కరికీ సుఖాన్నే ఇవ్వాలి. ప్రతి ఒక్కరితో దీవెనలే పొందాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement