Tuesday, March 19, 2024

బ్రహ్మాకుమారీస్‌ — నిర్వాహక కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో 15వది ‘నిర్వాహక కళ ‘

నిర్వాహక కళ :
క్రొత్త ప్రపంచ స్థాపన మరియు ఒక్కొక్క సంస్కారాన్ని మార్చుకొనుట ఎంత కఠినమైన కార్యం? చాలా గొప్ప కళాకారుడు లేక నిర్వాహకుడెవరంటే కొద్దిపాటి సాధనాలతో గొప్పకార్యం చేసి చూపించేవాడు. బాబా సిద్ధాంతం ‘ పని ప్రారంభించండి, సాధనాలు స్వతహాగా సమకూరుతాయి’ అనేవారు. బాబా ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక పనికి అవకాశం కల్పించేవారు. బాబా నిర్వహణ ఎంత ఉత్తమమైనదంటే ఇక్కడ అందరూ స్వయంగా పనిని కోరుకొనేవారు. ఇక్కడ పనిని సేవ అంటారు. ఈ సేవయే భవిష్యప్రాప్తికి ఆధారరూపమవుతుంది. మరియు మనోవాక్కర్మలతో పవిత్రత పూర్తిగా క్షీణిస్తుంది. అందువలన మానవులకు తమ కర్మేంద్రియాలను స్వాధీనపరుచుకొనే శక్తి ఉండదు. మానసిక ఏకాగ్రత, అంతరంగిక శాంతి, శక్తి యొక్క అనుభూతి పొందజాలరు. తమతమ ధర్మ స్థాపకులు బోధించిన నియమమర్యాదలను గూడా పాటించలేరు. వారు మాయతో లేక బలహీనతలతో ఓడిపోయినట్లుగా అనుభవం చేసికొంటారు. కేవలం పరమపిత పరమాత్మ మాత్రం, లేక వారి ధర్మపితలే మాయాజాలం నుండి విడించగలరని భావిస్తారు. వారి మాటలను ధ్యాసగా ఆలోచించనప్పుడు ఒకవేళ పరమాత్మ ఆదేశ నిర్దేశాలిచ్చినప్పటికీ, సహాయపడినప్పటికీ మనమే స్వయంగా ప్రయత్నం చేయాలని అపుడే ప్రాప్తుల సంతోషాన్ని సంతృప్తిని అనుభూతి చేసికోగమనే ని ష్కర్షకు వస్తాము. ఈ పురుషార్ధమే మన ఆధ్‌యత్మిక శక్తీకరణ దీని గురించే స్వయంగా పరమపిత పరమాత్మ కొన్ని ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము యొక్క వివిధ శాఖలు కూడ వాస్తవానికి ఆధ్యాత్మిక శక్తీకరణ యొక్క ప్రయోగశాలలే. అచట ఆధ్యాత్మిక శక్తి నింపి తమ మనోవికారాలను తప్పకుండా విజయం సాధించుట నేర్పబడుతుంది. 1937 సింధ్‌ (ఇప్పట పాకిస్తాన్‌) లో స్వయంగా శివపరమాత్ముడే ప్రజాపిత బ్రహ్మా (పూర్వనామం లేఖరాజ్‌) ద్వారా స్థాపించారు. నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివుడే వీరి తనువులో దివ్య ప్రవేశము గావించి వారికి ”ప్రజాపిత బ్రహ్మా” అని అలౌకిక నామధేయం చేశారు. బ్రహ్మా ముఖారవిందం ద్వారా జ్ఞాన యోగాల శిక్షణలను పొంది ఇక్కడ ఏ అధికారులు, మేనేజర్లు లేరు. ఎవ్వరి అజమాయిషీ లేదు. అందువలన ఈ నిర్వహణలో ఎలాంటి సమ్మెలకు అవకాశమే లేదు. ప్రతిరోజూ విద్య యొక్క క్లాసు నియమానుసారం జరుగుతుంది .

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement