Friday, March 29, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ఈశ్వరీయ సేవలో ఆత్మాభిమాని (ఆడియోతో..)

ఈశ్వరీయ సేవ అనగా నేమి?
ఈశ్వరీయ సేవ అనగా ప్రజలకు పరమాత్ముని పరిచయం ఇవ్వడం, వారి జీవిత లక్ష్యాన్ని బోధించుట. పవిత్రులై దివ్యగుణ ధారణ చేసే పాఠాలు చెప్పుట, మరియు వారిని ఆత్మాభిమానిగా చేయుట. మనమే స్వయంగా ఆత్మాభిమానిగా కాకపోతే శుష్క పండిత జ్ఞానంతో వినే శ్రోతలు కూడా ఆత్మాభిమానులు కారు. వాళ్ళు కూడా వినీవిననట్లు చేస్తారు. మనం ఆత్మ నిశ్చయంలో ఉంటూ మనం దృష్టి ఇస్తే ఆత్మభావంలో ఉండగలిగితే వాళ్ళు కూడా ఆత్మ నిశ్చయంలో వుంటూ శాంతి, పవిత్రతల ప్రయోజనం గ్రహిస్తారు. పరమపిత పరమాత్మునితో మన బుద్ధి సంబంధమును త్రెంచి ఇతరులకు జ్ఞానం వినిపిస్తే అది వారిపై ప్రభావం పడదు. ఆ జ్ఞానం వారికి బాగనిపించినప్పటికీ వారిలో ధారణ కాదు. కావున తమ ఉన్నతి, ఇతరుల ఉన్నతి కోసం ఆత్మ నిశ్చయంలో వుండుట తప్పనిసరి అని గ్రహించాలి.

ఈ విధంగా మనం ఈశ్వరీయ మహాకావ్యాలు ”పిల్లలూ ఆత్మనిశ్చయం పెట్టుకోండి, దేహాభిమానాన్ని విడిచిపెట్టండి” అనే మాటను మన నాలుగు పాఠ్యాంశాలతో జోడించినట్ల యితే ఇది ఒక మహత్త్వ పూర్వకమైన మాట చెప్పారని తెలుస్తుంది. ఈ మహా వాక్యాన్ని ఆచరించలేకపోతే మన విద్యలోని నాలుగు పాఠ్యాంశాలలో మనం బలహీనంగా అవుతాము. తక్కువ మార్కులు వస్తాయి. మన పాప కర్మలు దగ్ధం కావు. ధర్మరాజు పురిలో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. మనం సర్వగుణ సంపన్నులుగా కాజాలము. మనకు ఉన్నత దేవతా పదవి లభించదు. ఈ విధంగా మనం ఆలోచనా సాగరమధనం చేస్తూ ఆత్మ నిశ్చయంతో వుండాలి అనే ”ఆజ్ఞ” యొక్క మహాత్వం మనసులో ఇంకా స్పష్టమవుతుంది. అభ్యాసం చేయనారంభిస్తాము. సర్వతోముఖోన్నతి కూడా కలుగుతుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement