Tuesday, April 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ఆహార విహార మరియు వ్యవహారములపైన పూర్తి ధ్యాస (ఆడియోతో…)


మనిషి భారీ భోజనం చేసినపుడు, రోజుకు చాలా సార్లు తినే అలవాటు ఉన్నప్పుడు అతనిలో సోమరితనం ప్రవేశిస్తుంది. శరీరం బరువు అయినట్లు బుద్ధిమాంద్యం అయినట్లు తెలుస్తుంది. తరువాత నాలుకపై అదుపు లేరందువల్ల మెల్లమెల్లగా మిగతా కర్మేంద్రియాలు కూడా తిరుగుబాటు చేస్తాయి. మిగతా కర్మేంద్రియాలను అదుపు చేసి నోటిని మాత్రం అదుపు చేయకపోవుట అంటే మొత్తం దేశాన్ని స్వాధీనంలోనికి తెచ్చుకుని శత్రువుకు కొంచెం భూమి ఇచ్చుట వంటిది. ఆహార పదార్థాలు ఆకర్షణ కూడా ప్రకృతి యొక్క ఆకర్షణ. ఈ ఆకర్షణ నుండి రూపాంతరం చెందుట కూడా సంభవమే కావున జ్ఞాన యోగ మార్గాలలో భక్తి మార్గం వలె వ్రతాలు, ఉపవాసాలు లేనప్పటికీ ఇంద్రియాలను స్వాధీన పరుచుకొనుట అవసరమే. ఎందుకంటే భోజన లోలత్వం పానీయ పదార్థాల తృష్ణ, రుచికి లోబడుట కూడా ఒక విధంగా బాహ్యముఖత్వమే. దేహాభిమానం యొక్క మారు రూపమే. ఇదే మనిషిని మాటిమాటికి స్థూలత్వం వైపుకు తీసుకు వెళ్ళుతుంది. కావున యోగి కేవల ం సాత్విక భోజనం యొక్క నియమం పెట్టుకొనాలి. వాటిని మాటి మాటికి తినుట త్రాగుట మొదలగు వాటని పోగొట్టుకోవాలి.

ఇదే విధంగా మనిషి తన విహారమును కూడా సరిగ్గా వుంచుకోవాలి. విహారమును సరిగా వుంచుకోవాలనే ఉద్దేశ్యంతో బౌద్ధ భిక్షువులు ఇల్లు వాకిలి వదిలి ‘విహారాలు’ తయారుచేసుకున్నారు. సన్యాసులు పీఠాలు, ఆశ్రమాలు స్థాపించారు. రాజయోగి అలా చేయకూడదు కాని ఇంటినే విహారముగా అనగా ఆశ్రమముగా తయారు చేయాలి. అనగా ఇంటిలో పవిత్రత వాతావరణము తయారు చేయాలి అని భావము. సాధనా సామాగ్రి కూడా ఎక్కువ పోగు చేసుకొనరాదు. అనేక వస్తువలను కొని ఇంటిని ఒక జనరల్‌ మర్చం ట్‌ లాగ తయారు చేయుట యోగికి అనుకూలమైనది కావు. మా ఉద్దుశ్యం ఏమిటంటే ఎక్కువ అట్టహాసాలు, అలంకరణలు, కీర్తి, విశ్రాంతులు, ఆర్భాటాలు, మొదలగు సాధనాలతో మన ఇంటిని నింపుకోవడం అటే అనవసరంగా మన బుద్ధిని భారం చేసుకోవడమే. మనం నివసించే విహారం ఎంత సాదాగా, సాత్వికంగా, స్వచ్ఛంగా స్వధర్మ స్మృతిని పెంచే విధంగా వుంటే అంత శ్రేయస్కరం

పరస్పర వ్యవహారాలలో ఎక్కడైనా అనుమానం వస్తే విభేదాలు, విడిపోవడాలు వస్తాయి. వైమనస్యం లేక ఉల్టా వైరాగ్యం కలుగుతుంది. అలటువంటి సమయంలో మనస్సు ఆనందస్థితిలో ఉండకుండా ఏతో ఒక సందిగ్ధంలో పడి యోగం తెగిపోతుంది. కావున అందరితో కలిసి మనం సరళత, మధురత, నమ్రత, స్నేహం, సానుభూతి, సహనశీలత, గౌరవం, సహాయ సహకారాలను విడిచిపెట్టకుండా ఘృణ, ద్వేషం, ప్రతీకార భావన, నింద, చాడీలు, వైర విరోధాలు లేకుండా చూచుకొనకపోతే మన ఆధ్యాత్మిక ఉన్నతిలో ఇతరుల పట్ల, మన యొక్క ఇతరుల యొక్క వ్యవహారంలో చాలా పెద్ద అవరోధాలవుతాయి.

ఈ విధంగా మనం ఈ అయిదు విషయాలను సరిచేసికొనే ప్రయత్నం చేస్తే మనస్థితి, కళలు పెంపొందుతాయి. మన సంస్కారాలు మారిపోవడం మాత్రం తధ్యం.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement