Thursday, March 28, 2024

బ్రహ్మరథం అంటే…!

ఒకసారి ఇంద్రునికి, బృహస్పతికి మధ్య విభేదం వచ్చింది. ఇంద్రుడు బృహ స్పతిని కించపరిచాడు. బృహ స్పతి స్వర్గా న్నుండి వెళ్లిపో యాడు. ఇంద్రుడు దేవగురు వుగా బృహస్పతి స్థానంలో త్వష్టప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి నియమిం చుకున్నాడు. ఈ విశ్వరూపు డు రాక్షసులపై బంధు ప్రీతిని కనబరుస్తూ వారికి హవిర్భావాలు ఇవ్వడంతో ఇంద్రుడు కోపించి విశ్వరూపుణ్ణి సంహరించేసరికి ఇంద్రునికి బ్రహ్మహత్యా పాత కం ఆవహించింది. ఆ దోషాన్ని పోగొట్టు-కునేందుకు స్వర్గాన్ని వదిలివెళ్లిపోయాడు ఇంద్రుడు. అప్పుడు దేవతలంతా భూలో కానికి వచ్చి నహుష మహారాజుకు ఇంద్రాధిపత్యాన్ని కట్టబెడ తారు. నహుషుడు చాలా గొప్పవాడు. ఎప్పుడైతే ఇంద్రపదవి అత నికి లభించిందో అతడిలో గర్వాంధకారం పొడసూపడం మొద లు పెట్టింది. దాంతో దేవతలు, మహర్షులు, దిక్పాలకు లను కించ పరచడమే కాకుండా శచీదేవిని కోరతాడు. అప్పుడు శచీదేవి బ్రహ్మరథంపై ఊరేగిరమ్మని అతడికి షరతు విధిస్తుంది. నహు షుడు సప్తర్షులచేత పల్లకీని మోయిస్తూ అందులో బయల్దేరతాడు. బ్రహ్మరథ మనబడే ఆ పల్లకీ మోస్తున్నవారిలో అగస్త్యుడు కూడా ఒకరు. అగస్త్యుడు పొట్టివాడు. అందుచేత అతను పల్లకీ మోసేవైపు ఒరిగిపోతూ ఉంటు-ంది. వేదాలను, మంత్రాలను అవమానపరు స్తూ… సర్పసర్ప అంటూ అగస్త్యు డ్ని కాలితో తంతాడు నహుషుడు. సర్ప సర్ప అంటే తొందరగా నడవమని అర్థం. దాంతో కోపించిన అగస్త్యుడు ‘సర్పోభవ’ అంటూ శపిస్తాడు. ‘సర్పోభవ’ అంటే ‘సర్పం అవుదువుగాక!’ అనిఅర్థం. తక్షణమే నహుషుడు సర్పంగా మారి భూలోకంలోకి వచ్చిపడ్డాడు. ఎప్పుడైతే సర్పంగా మారాడో వెంటనే అతనిలోని గర్వం పటాపంచలైంది. తన
తప్పిదానికి పశ్చాత్తాపపడి తనకీ రూపం నుండి విముక్తిని కలిగిం చాలని అగస్త్యుడ్ని ప్రార్థించాడు. అగస్త్యుడు దయతలచి సర్ప రూపంలో ఉన్న నీవు అడిగే ప్రశ్నలకు ఎవరైతే సమాధానాలు
చెపుతారో వారి వల్ల నీకీ రూపం పోతుందని చెబుతాడు. ఆ తర్వాత అరణ్య వాసంలో భీముడి వల్ల అతనికి శాపవిముక్తి అయి మానవ రూపాన్ని ధరిస్తాడు. బ్రహ్మవంశీయులు లేదా బ్రహ్మవేత్తల చేత మోయబడే వాహనాన్నే ‘బ్రహ్మరథం’ అంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement