Thursday, April 25, 2024

బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబిక

కర్నూలు, పభన్యూస్‌ బ్యూరో: భ్రమరాంభికా, మల్లికార్జున స్వాములు కొలువై ఉన్న శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన శుక్రవారం నవదుర్గ అలంకరణలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని బ్రహ్మచారిణీ స్వరూపంలో అలంకరించారు. నవదుర్గలలో ద్వితీయ రూపమైన ఈ దేవిని పూజిం చడం వల్ల విశేష ఫలితాలు కలగగడంతో పాటు సర్వత విజయాలు లభిస్తాయన్నది భక్తుల నమ్మకం, ఈ దేవీని పూజించడం వలన ముఖ్యంగా మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ద్విభుజరాలైన ఈ దేవి కుడిచేతిలో జపమాల,ఎడమచేతిలో కమండలాన్ని ధరించి ఉండటం విశేషం.
మయూరవాహనసేవ శ్రీశైలంలో శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లను మయూర వాహనంలో ఊరేగించారు. ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి ,మయూరవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేకంగా పూజాధి కార్య క్రమాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement