Friday, March 29, 2024

ఫలాలు – నైవేద్యం – ఫలితాలు

నిత్య పూజలోనూ, ప్రత్యేక పూజల్లోను దేవునికి అనేక రకాల ఫలాలు నైవేద్యంగా సమర్పిస్తాం. ఫలాలను నివేదన చేయడం వల్ల ఫలితం ఏమిటి? వివిధ రకాల ఫల నివేదనల వల్ల ఎటువంటి ఫలితాలు వుంటాయనేది చాలామందికి అవగాహన వుండదు. కొబ్బరి, అరటిలాంటి తరచుగా దేవునికి నైవేద్యం పెట్టే ఫలాల వల్ల ఈవిధమైన ఫలితాలు లభిస్తాయి.
కొబ్బరి కాయ (పూర్ణ ఫలం): భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సుల భంగా విజయవంతం అవుతాయి.
అరటి పండు: భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
నేరెడు పండు: శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవం తులు అవుతారు.
ద్రాక్ష పండు: భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచిన-్లటెతే ఎల్లవేళలా సుఖసంతో షాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
మామిడి పండు: మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభు త్వం నుంచి రావలసిన నగదు ఎటు-వంటి అడ్డంకులు లేకుండా సకాలం లో అందుతుంది. నమ్మి మోసపోయి నప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్ల యితే మోసం చేసిన వారు స్వయం గా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
అంజూర పండు: భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూరాపండును అందరికి పంచిన తరువాత తిన్న వారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరోగ్య వంతులు అవుతారు.
సపోట పండు: సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరా లు అన్ని తొలగిపోతాయి.
యాపిల్‌ పండు: భగవంతుడికి యాపిల్‌ పండుని నైవేద్యంగా పెడితే దారిద్య్రం తొలగి ధనవంతులు అవుతారు.
కమలా పండు: భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.
పనసపండు: దేవుడికి పనస పండుని నైవేద్యంగా పెడితే శత్రు
నాశ నము, రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

– డా. చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement