Saturday, April 20, 2024

ప్రసాదం అంటే..

భగవంతుని గుణగణాలు, రూప స్వరూ పాల విశేషాలు మననం చేసుకోవటం ప్రసాదం. భగవంతుని ఊసులతో మనసు నింపు కోవటం ప్రసాదం. భగవంతుని లీలలు, మహమల ధ్యాసలో ఉండటం ప్రసాదం. ఉండగలగటమూ ప్రసాదమే. భగవత్‌ తత్వం అలకించడం, భగవత్‌ తత్వం గురిం చి ఆలోచన చేయడమూ, అనుభవానికి తెచ్చుకోవ డం ప్రసాదం ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, నడ వాలనే ఆసక్తి కలగటం, నడవ గలగటం ప్రసాదమే. దైవ ప్రసాదమే. ఏది జరిగినా, ఏమి జరుగుతున్నా, ప్రతీదీ దైవ నిర్ణయం అని అనుకోవడం, అనుకోగల గటమూ ప్రసాదమే.
”కర్మణ్య వాధికారస్తే….” అని గీతాచార్యుడు గీతలో చెబుతాడు. ప్రయత్నం నువ్వు చెయ్యి. దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఆశించకు. ఫలితం ఏమొచ్చి నా, అసలు రాకున్నా, అది భగవత్‌ నిర్ణయం అను కున్నప్పుడు, భగవత్‌ నిర్ణయాన్ని అనుభవించ గలిగినప్పుడు ప్రసాదమే. అలాంటి స్థితికి మనం ఎదిగినప్పడు ప్రతీదీ దైవ ప్రసాదమే అవుతుంది.
ప్రసాదాలన్నిటిలోను ఏది ఉత్కృష్టమైన ప్రసా దం? ఈ ప్రశ్నను ఓ మామూలాయన ఓ మహాను భావుడ్ని అడిగేడు. ”విభూతి ప్రసాదం” అని ఆ మహా నుభావుడు సమాధానం చెప్పేడు. ఎందుకు? ఎలా? అని సందే#హం వెలిబుచ్చాడు మామూలాయన. సృష్టిలో ఏ పదార్థమైనా, ఎంత విలువైనదైనా క్షణిక మైనదే. ఎప్పుడో ఒకప్పుడు నాశనమయ్యేదే. చివ రికి బూడిద అవ్వాల్సిందే. బూడిదయ్యేక దానికి మరో రూపం ఉండదు. అచిరమైన అన్ని ఐశ్వర్యాలు మారి మారి, యిక మారలేని ఆఖరిస్థితి బూడిద. అంటే ”విభూతి”. జీవిత తత్వాన్ని అందించే, బోధించే మహోన్నత ప్రసాదం ”విభూతి ప్రసాదం” అని జ్ఞానబోధ చేసేడు ఆ మహనీయుడు. ఎంత ఉన్నతమైన వివరణ! ఆధ్యాత్మికంగా జీవిత అర్ధాన్ని, పర మార్ధాన్ని, పర అర్ధాన్ని విడమర్చి చెప్పే, ఎంతటి లోతైన విశ్లేషణ!!
అసలు ”ప్రసాదం” అంటే ఏమి టి? ఎలా? ఎందుకు? అనే విషయాలు విచారణ చేద్దాం. కొబ్బరి చెక్కో, బెల్లం ముక్కో, వడపప్పో, పానకమో, కాకపోతే గోధుమ పిండీ, పాలు, చక్కెరతో చేసిన ప్రసాదం అని పిలువబడే వం ట కమో, యేదైనా ప్రసాదమే. ఆఖరుకి వండి వార్చిన అన్నమైనా, దానిని భగవంతునికి నివేదన చేస్తే, భగవత్‌ శేషమైన, ఆ అన్నం కాస్తా ”అన్న ప్రసాదం” అవుతుంది . ఏ పదార్థాన్నైనా భగవంతుడికి నివేదన చేసి, నైవేద్యంగా అర్పణ చేస్తే, అది పవిత్రతను ఆపా దించుకుని, దైవ ప్రసాదంగా మారుతుంది. ఎంత పనిలో ఉన్నా ప్రసాదం అనగానే, ప్రతి ఒక్కరూ భక్తితో పరవశించి పోతారు. ఎంత వారైనా, ఎంతటి వారైనా, భక్తితో రెండు చేతులు చాచి విన మ్రంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కళ్ళకు అద్దుకొని ఆరగిస్తారు. ప్రసాదం కోసం ప్రతి ఒక్కరూ తపిస్తా రు. తహతహ లాడుతారు. దైవదర్శనం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేకపోయినా, అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదంలోనే, ఆ భగవంతుణ్ణి దర్శించు కున్నంతటి అనుభూతికి లోనవుతారు. ఇది మాటల కందని ”ప్రసాదం” మహత్యం!!
సత్యనారాయణ స్వామి వ్రతకథలో, ”ప్రసా దం” విశిష్టతను వివరించే ఘట్టాలు రెం డుంటాయి. మనస్ఫూర్తిగా భక్తి ప్రప త్తులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంది ఓ అమ్మాయి. ఇంతలో వ్యాపారం కోసం విదేశాల కేగిన తన పెనిమిటి వస్తున్నాడన్న వార్త తెలుస్తుం ది. భర్త మీదున్న ప్రేమతో వ్రత ప్రసాదం స్వీకరించకుండా పరుగు పరుగున, సము ద్ర తీరానికి వెళ్తుంది. ఫలితంగా పెనిమిటి ప్రయా ణం చేస్తున్న ఓడ అకస్మాత్తుగా సముద్రంలో మునిగి పోతుంది. ప్రసాదం స్వీక రించలేదన్న తను చేసిన తప్పు, తల్లి ద్వారా తెలుసు కున్న ఆ అమ్మాయి, పశ్చాత్తాపంతో యింటికి పరు గెత్తి కళ్ళ కద్దుకుని ప్రసాదా న్ని ఆరగిస్తుంది. ఇది ఒక ఘటన. ప్రసాదం అనేది కుల మత బేధాలకు, స్థాయీ స్థానం తేడాలకు, హోదాలకు, అంతస్తులకు అతీతమైనదనే సందేశాన్ని విశదపరచే మరో సంఘ టన కూడా సత్యనారాయణ స్వామి వ్రత కథలో మనకి దర్శనమిస్తుంది. ఇదీ క్లుప్తంగా ప్రసాదం విశిష్టత. నిజానికి మానవ జీవి తమే దేవుడు జీవుడుకి యిచ్చిన మహా ”ప్రసాదం”.

– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement