Thursday, March 28, 2024

పలు అభివృద్ధి పనులకు టీటీడీ ఆవెూదం

ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయాలు
తిరుమల, ప్రభన్యూస్‌: టీటీడీ అధికారులు పలు అభివృద్ధి పనులకు ఆమో దం తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్ష తన గురువారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించారు. ఈ సమా వేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ మీడియాకు వివరించారు. జమ్మూలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపి నట్లు చెప్పారు. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు, శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ. 7.50 కోట్లతో టెండర్లకు ఆమోదించామన్నారు. టీటీడీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్‌ తరహాలో టీటీడీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల హెల్త్‌ ఫండ్‌కు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 2లో పలు ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.61 కోట్లతో టెండర్లకు ఆమోదించినట్లు చెప్పారు. స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రీసెర్చ్‌ భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి రూ.4.46 కోట్ల తో టెండర్లకు ఆహ్వానం తెలిపాలని నిర్ణయించినట్లు వివరించారు. టిటిడి ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మ య్య, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement