Tuesday, April 23, 2024

పర్యాటక ప్రదేశాలను పరిరక్షించుకుందాం

చారిత్రక ప్రదేశాలను సందర్శించడం వలన విజ్ఞానంతో పాటు వినోదం కూడా లభిస్తుంది, విద్యార్థుల సృజనాత్మకత శక్తిని వెలికి తీస్తుంది. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్‌ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశం పర్యాటక ప్రదేశాల సందర్శనను ప్రోత్సహిం చడం. తద్వారా… ప్రపంచంలోని ప్రజల ఆచార వ్యవహారాలు, శీతోష్ణస్థితులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. లోక జ్ఞానం వస్తుంది. చారిత్రక పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. ఇదే కాక దేశ స్వరూపస్వభావాలు మీద అవగాహన ఏర్పడుతుంది. పర్యాటక ప్రదేశంలో ఉపాధి అవకాశములు పెరిగి నిరుద్యోగిత తగ్గుతుంది. అంతేకాదు.. ఇవి ప్రభు త్వానికి మంచి ఆదాయ వనరులు కూడా. ఇటీవలే తెలంగాణ ప్రాంతంలో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. కాకతీయుల కాలంలో కట్టిన ఈ దేవాలయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరింత అభివృద్ధి పరుస్తున్నాయి. కోవిడ్‌ కారణంగా ప్రపంచ పర్యాటక రంగమే ఆదాయ వనరులు కోల్పోయింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సంద ర్భంగా పర్యాటక ప్రదేశాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
– సయ్యద్‌ షఫీ
హనుమకొండ

Advertisement

తాజా వార్తలు

Advertisement