Friday, April 26, 2024

పరమార్ధంలో ”ఆత్మ నిశ్చయమునకు గల మహాత్యం”

ఇపుడు పరమార్ధంతో ఈ మహావాక్యం యొక్క సంబంధాన్ని జోడించండి. మనం భక్తి మార్గంలో కూడ జపము, తపము, యజ్ఞం, పూజ, యాత్ర భక్తి చేస్తూ వచ్చాము. కానీ ఆత్మనిష్ఠ లేనందువలన, ఆత్మిక దృష్టి లేనందు వలన నిర్వికారిగా కాలేకపోయాము. సాధనా పథంలో ముందకు సాగలేక పోయాము. ప్రతీ రోజూ ”విషయవికారాలు పోగొట్టు, పాపాలు హరించు దేవా!” అని ప్రార్థన చేస్తూనే వున్నాము కానీ మన పాపాలు నశించలేదు. కారణమేమంటే అన్ని వికారాలు దేహాభిమానంతోటే జన్మిస్తాయి. ఆత్మ నిశ్చయంతో నశిస్తాయి. కానీ మనం ఆత్మ నిశ్చయం యొక్క అభ్యాసమే చేయలేదు. మనం ఆత్మలం అని మాత్రం తెలుసు. కానీ నడుస్తూ, తిరుగుతూ, పనులు చేస్తూ, ఆత్మిక స్మృతిలో ఉపస్థితులమై ఉండే అభ్యాసం చేయలేదు. భక్తి చేయడానికి కూర్చునే వాళ్ళం కానీ మనలను మనం ”దేహానికి భిన్నమైన ఒక ఆత్మ” అనే నిశ్చయంతో కూర్చోలేదు. పూజలు, యజ్ఞాలు, అన్నీ దేహాభిమానంలో ఉండే చేసేవాళ్లం. కావున మనకు పూర్వ వికర్మలు దగ్ధం కాకపోయేవి. ముందు కూడా అవి వదలకు పోయేవి. శాంతి కూడా లభించేది కావు. ఈశ్వరీయ స్మృతి యొక్క సుస్థిరమైన యదార్థమైన ఆనందరసానుభూతి కలుగక పోయేది. పైగా ఎంతో ధనం ఖర్చు చేసినప్పటికీ, అనేక స్థానములలో వెళ్ళి తలలు వంచి నమస్కరించినప్పటికి ఎన్నిచోట్ల తిరిగినప్పటికీ, శాస్త్ర గ్రం థాలు చదివినప్పటికీ, గురువులు స్వామీజీల వద్దకు వెళ్ళినప్పటికీ ”మా మనసు చంచలంగా ఉంది. మాకు మానసిక శాంతి లేదు. మాకు శాశ్వతంగా ఆత్మిక ఉన్నతి కలుగుట లేదు” అనేవాళ్ళం. ఇపుడు ఆత్మ స్వరూప స్థితిలోనికి వెళ్ళే అభ్యాసం చేయగానే చాలా శాంతి లభిస్తుంది. ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. మన జీవితంలో పవిత్రత కూడా వస్తుంది. ఈశ్వరీయ స్మృతిలో ఉండగలం. ఎందుకంటే ఈశ్వరునితో మనకు గల సంబంధం దైహికమైనది కాదు ఆత్మికమైనది. అంతకు ముందు మనం దేహాభిమానంలో ఉండేవాళ్లం కాబట్టి మనస్మృతి ప రమాత్మతో జోడింపబడకపోయేది. ఉదా:- ఒక కరెంటు తీగ జోడించుటకు రెండింటి పై నున్న ప్లాస్టిక్‌ రబ్బరును తొలగించి తీగలను కలిసినపుడే వి ద్యుశ్చక్తి ప్రసరించినట్లు మనం శరీరానికి అతీతమైన ఒక ఆత్మగా భావించి కూర్చొనుట చేత మరియు పరమపిత పరమాత్మను కూడా నిరాకారుడు శరీర రహితుడు మరియు సర్వ శ్రేష్టాత్మగా భావించి అతనితో స్మృతి ద్వారా సంబంధం జోడించుటచేతనే ఆత్మ లైట్‌ మైట్‌ శక్తి యొక్క అనుభవం చేసుకొంటుంది. కావున ఈ ఒక్క మహావాక్యం చేత పరమార్ధంలో చాలా తేడా వస్తుంది. ఉన్నతి కూడా కలుగుతుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement