Saturday, April 20, 2024

నేడు స్వర్ణకవచ అలంకారంలో దుర్గమ్మ

అమరావతి, ఆంధ్రప్రభ: దసరా మహోత్సవాలలో తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచ కనకదుర్గగా దర్శనమిస్తున్నారు. ఆమె దేహం మంతా స్వర్ణమయంగా ఉంటు ంది. తలపాపిడి దగ్గర్నుంచి ఆమె పాదాల వరకు వివిధ ఆభరణాలు ఉంటాయి. ఆ ఆభరణాలు ఆమెకు మాత్రమే సొంతం. దివ్య లీలా విగ్రహ రూపిణి అయిన దుర్గమ్మ ఆభ రణాలతో పాటు బంగారు కవచాన్ని ధరించి ఉంటారు. మాధవవర్మ విజయవాడను పాలించిన రోజులలో ధర్మం నాలుగు పాదా ల నడిచేది. అవినీతి, అన్యాయాలకు తావు ఉండేది కాదు. ఒక రోజు మాధవవర్మ కుమా రుడి రధం కింద పడి నిరుపేద కుమారుడు మరణించాడు. తనకు న్యాయం చేయా లని కోరుతూ రాజాస్దానం వద్దకు వెళ్ళి గంట కొడుతుంది. మాధవవర్మ అమె శోకిస్తున్న తీరుకు చలించిపోతాడు. విచారణలో తన కుమారుడి తప్పును తెలుసు కుని మరణశిక్ష విధిస్తాడు. ఈ పంఘటనను పరిశీలించిన దుర్గమ్మ వెంటనే ప్రత్య క్షమై మాధవవర్మ ధర్మనిరతిని మెచ్చుకుని వరమిస్తుంది. పేదరాలి కుమారుడిని బతికిస్తుంది. ధర్మనిరతికి మెచ్చి బంగారు రాశులను కానుకగా అందచేస్తుంది. అప్పట్నుంచి దుర్గమ్మను కనకదుర్గమ్మగా కొలుస్తున్నారు. మరోవైపు రాక్షస సం హారం చేసిన దుర్గమ్మకు దివ్యశక్తులున్నాయి. ఆమె ధరించిన బంగారు కవచాన్ని ఎలాంటి ఆయుధాలు తాకజాలవు. ఇదొక రక్షణ కవచంగా ఉంటుంది. దీంతో స్వర్ణకవచ దుర్గగా అమ్మవారు దర్శనమివ్వడం ప్రత్యేకం. స్వర్ణకవచం నుంచి వచ్చే కాంతి రేఖలు భక్తులపై ప్రసారమయితే ఎటువంటి శత్రు బాధలు ఉండవని, చీడ పీడలు సోకవని ఆరోగ్యంగా ఉంటారని భక్తుల నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement