Friday, March 29, 2024

నేడు గాయత్రీదేవిగా దుర్గమ్మ

అమరావతి, ఆంధ్రప్రభ: శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమనీల, దవళవర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి.ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రీ మంత్రంతో అనుబంధం వుంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడంవలన సకల మంత్రసిద్ధి ఫలాన్ని పొందుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement