Friday, April 26, 2024

నేటి రాశి ప్ర‌భ (29-11-21)

మేషం : పనులలో తొందరపాటు-. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం : నూతన పరిచయాలు. ఆసక్తికర సమాచారం. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. సోదరులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మిథునం : పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం : సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తు, వస్త్ర లాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం : ఇంటర్వ్యూలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహాన్నిస్తుంది.

- Advertisement -

కన్య : పనులు నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల : వ్యవహారాలలో ఆటంకాలు. బంధుమిత్రులతో వివాదాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

వృశ్చికం : శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు : పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మకరం : వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు కొన్ని చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

కుంభం : ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దూరపుబంధువుల కలయిక. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.

మీనం : వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement