Friday, March 29, 2024

నేటి రాశి ప్రభ (5-4-2021)

మేషం:
వ్యవహారాలలో విజయం. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం:
ముఖ్యమైన పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆసక్తికర సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం:
వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం:
కొన్ని కార్యక్రమాలు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.

సింహం:
పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య:
మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల:
రుణభారాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం:
ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

ధనుస్సు:
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు.

మకరం:
వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం:
మిత్రుల చేయూతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేషయోగదాయకం.

మీనం:
సోదరులతో కలహాలు. ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement