Wednesday, April 24, 2024

నేటి రాశి ప్రభ (21-9-2021)

మేషం
వ్యయ ప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో చికాకులు. దైవదర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత వరకూ అనుకూలిస్తాయి.

వృషభం
పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. గృహయోగం. కీలక నిర్ణయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిధునం
వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం
దూరపు బంధువుల కలయిక. ఆస్తిలాభ సూచనలు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాదసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి.

సింహం
వ్యవహారాలలో విజయం. భూలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు కొత్త నిర్ణయాలు, వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

- Advertisement -

కన్య
బంధువులతో తగాదాలు, పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు, ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

తుల
బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు, కొత్త రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు మందగిస్తాయి. పనులు వాయిదా. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

వృశ్చికం
రుణ బాధలు తొలగుతాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

ధనుస్సు
పరపతి మరింత పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

మకరం
కుటు-ంబంలో కొన్ని సమస్యలు. వ్యవహారాలలో అవరోధాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం
చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు, దైవదర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మీనం
కొత్త వ్యక్తుల పరిచయం శుభవార్తా శ్రవణం, ఆర్థిక ప్రగతి, ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి, దైవచింత.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement