Friday, April 19, 2024

నేటి రాశి ప్రభ (17-4-2021)

మేషం:
వ్యయప్రయాసలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ ఫలించదు. ఆరోగ్య భంగం.

వృషభం:
శ్రమాధిక్యం. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటాయి.

మిథునం:
పనుల్లో విజయం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు.

కర్కాటకం:
శ్రమాధిక్యం. పనులలో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు చేస్తారు.

సింహం:
బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు విస్తరిస్తాయి. ధన, వస్తులాభాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కన్య:
కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. దైవదర్శనాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల:
పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం:
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

ధనుస్సు:
రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప విభేదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. దైవదర్శనాలు. పరిస్థితులు అనుకూలించవు.

మకరం:
పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. ఆధ్యాత్మిక చింతన.బంధువుల కలయిక.

కుంభం:
పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. పనులలో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులు అనుకూల ఫలితాలు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement