Friday, April 26, 2024

నేటి రాశి ప్రభ (14-9-2021)

మేషం
రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

వృషభం
కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయోగం, వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు.

మిథునం
పాతబాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. సంఘంలో ఆదరణ. మిత్రుల నుంచి సహాయం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కర్కాటకం
బంధువలతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింత. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

సింహం
పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

- Advertisement -

కన్య
శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభ కార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. విద్యార్థులకు శుభవార్తలు. ఉద్యోగాలలో
ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తుల
యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం
అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో తగాదాలు. అరోగ్య సమస్యలు. పనులలో ఆటంకాలు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు
ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు నెలకొంటాయి.

మకరం
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతారణం.

కుంభం
వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మీనం
పాత మిత్రుల కలయిక. విందు వినోదాలు. కార్యసిద్ధి. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement