Tuesday, April 23, 2024

నేటి రాశి ప్రభ (13-6-2021)

మేషం: ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులలతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: రాబడి ఆశాజనకంగా ఉంటు-ంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు- తొలగుతాయి.

మిథునం:పనుల్లో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరాశ తప్పదు.

కర్కాటకం: కాంట్రాక్టర్లకు కొంత నిరాశ. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు కృషి ఫలించదు.

సింహం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

- Advertisement -

కన్య: రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన ప్రగతి కనిపించదు.

తుల: అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం.

వృశ్చికం: మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి. దైవచింతన.

ధనుస్సు: కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. వాహనసౌఖ్యం.

మకరం: చిన్ననాట మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం: కుటు-ంబంలో చికాకులు. ధనవ్యయం. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement