Wednesday, April 24, 2024

నేటి రాశి ప్రభ (12-4-2021)

మేషం:
పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఖర్చులు మరింత పెరుగుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.

వృషభం:
పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మిథునం:
కాంట్రాక్టులు దక్కుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.

కర్కాటకం:
శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు.. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం:
ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య:
పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

తుల:
పనులలో అవాంతరాలు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

వృశ్చికం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పనుల్లో అనుకూలత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు:
పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం:
పనులలో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం:
ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. భూలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం:
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. పనులు సజావుగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement