Friday, March 29, 2024

నేటి రాశి ప్రభ (1-5-2021)

మేషం
పనులు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. కుటు-ంబంలో సమస్యలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి.

వృషభం
వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. పనులలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం
కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది.

కర్కాటకం
శ్రమ మరింత పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం
పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటు-ంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

కన్య
చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

తుల
ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం
పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు
శ్రమ తప్ప ఫలితం ఉండదు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మకరం
రుణాలు చేస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగక ఇబ్బందిపడతారు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం
శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న రీతిలో సాగుతాయి.

మీనం
దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహవంతంగా ఉంటు-ంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement