Thursday, April 18, 2024

నామస్మరణ!

నామస్మరణ చేసేటప్పుడు భగవంతుడు…
నీ రాగాన్ని, నీ తాళాన్ని, నీ సంగీత పరిజ్ఞానాన్ని, నీ గాత్ర మాధుర్యాన్ని చూడడు.
నీ ఆర్తిని, నీ ఆర్ద్రతని, నీ భావాన్ని మాత్రమే చూస్తాడు. నీ శక్తిని చూడడు.
నీ భక్తిని మాత్రమే చూస్తాడు. నీ విత్తాన్ని చూడడు. నీ చిత్తాన్నే చూస్తాడు.
నీ ఆర్భాటాన్ని చూడడు. నీ అంతరంగాన్ని చూస్తాడు.
నీ కులాన్ని చూడడు. నీ గుణాన్ని మాత్రమే చూస్తాడు.

భగవంతుడు వెన్నకన్న మెత్తనివాడు. వెన్న ఎంత మెత్తనిది అయినప్పటికీ, వెన్న కరిగి నేయి అవాలంటే, చిన్న వేడి అవసరం. వెన్న కన్న మెత్తనైన భగవంతుడు, అనుగ్రహం అనే నేతిని మనకి ప్రసాదించాలంటే, ఆర్తి, భక్తి అనే వేడిని తగిలించాలి. ఆర్తితో కూడిన భక్తి సాధనమే నామస్మరణ. మనసుకి నచ్చిన భగవన్నామాన్ని తాళం వేస్తూ రాగంగా ఆలపిం చటమే భజన. మానవ దేహమనే మర్రిచెట్టు కొమ్మల మీద కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాల పక్షులు కూచుంటాయి. మనసుని కల్లోల పరుస్తుంటాయి. మనుషులను అరు పులు శబ్దాలతో పీడిస్తుంటాయి. అప్పుడు భగవన్నా మాన్ని ఉచ్ఛరిస్తూ, తాళాలతో తాళం వేస్తూ, రెండు చేతులతో చప్పట్లు చరుస్తూ, నోరారా భగవ న్నామాన్ని గానం చేయాలి. ఆ సడికి, భగవ న్నామ ప్రభావానికి, మన మీద వాలిన అరిషడ్వ ర్గాలనే పక్షులు ఎగిరిపోతాయి. అదీ భజన విశి ష్టత. భగవంతుని గాన విశేషత. అయితే మన మీం చి ఎగిరి పోయిన అరిషడ్వర్గాలనే పక్షులు, ఎక్క డికి వెళ్తాయనే సందేహం ఒకాయనకు వచ్చింది. సందేహం తీర్చమని గురువు గారిని అడిగేడు. ”ఎగిరిపోయిన అరిషడ్వర్గాలనే పక్షులు, భజనలు చేయని వాళ్ళ భుజాల మీద వాలుతా యి.” అని వ్యంగ్యంగా గమ్మత్తుగా గురువు చెప్పే రు. భజన ప్రాముఖ్యాన్ని వివరించే అద్భుతమైన చమత్కారమిది. భజన నామస్మరణ విశాల పరిధి ఒక్కటే. నిశితంగా చెప్పాలంటే మనం ఒక్కరమే నామాన్ని స్మరణ చేసుకోవడం నామస్మరణ. సమిష్టిగా భగవన్నామాన్ని గానం చేసుకోవడం భజన. భగవత్‌ సాక్షాత్కారం కోరేవారికి, నామస్మ రణకు మించిన ఔషధం కలియుగంలో లేనే లేదు. భగవన్నామం భవసాగరాన్ని దాటించే సాధనం. నామస్మరణలో భగవన్నామం నీ ఊపిరి కావాలి. భగవంతుడినే నీ ఊపిరిగా చేసుకోవాలి. నామం లో భగవంతుడి (నామిని)ని చూడాలి, చూడగల గాలి. నామస్మరణలో నామామృతాన్ని గ్రోల గల గాలి జీవితమనే మహా సాగరాన్ని దాటడానికి పెద్ద ఓడ అక్కరలేదు. నామస్మరణ అనే చిన్న తెప్పచాలును.
అయితే నామస్మరణ, దైవచింతన అని రెండు ఉన్నాయి. నామాన్ని స్మరిం చటం నామస్మరణ. ఆ నామం చేసిన లీలలను మహిమలను మననం చేసుకోవటం దైవ చింతన . ఉదాహ రణకు క్రిష్ణా క్రిష్ణా అని శ్రీకష్ణ నామాన్ని జరిపిం చటం నామస్మరణ. శ్రీక్రిష్ణుడు చేసిన లీలలను, మహిమలను, మననం చేసుకోవటం దైవ చింతన. అయితే నామస్మరణకు ఏ నామం గొప్పది? ఏ నామాన్ని పట్టుకోవాలి? ఏ నామాన్ని పెట్టు కోవాలి? ఏ నామాన్ని స్మరణ చేయాలి? అనే సందే హాలు సహజంగానే వస్తాయి. అన్ని నామాలూ ఒక్కటే. అన్ని నామాలూ గొప్పవే. నామమే వేరు. నామి (భగవంతుడు) ఒక్కడే . పేరులే వేరు. పరమాత్మ ఒక్కడే. భావమే వేరు. భగవంతుడు ఒక్కడే. మార్గాలే వేరు. గమ్యం ఒక్కటే. రూపాలేవేరు. స్వరూపం ఒక్కటే. మనసుకు నచ్చిన ఏదో ఒక నామాన్ని, మనసున పెట్టుకుని మనసారా భజన చేద్దాం. భగ వంతుణ్ణి చేరుదాం. స్మరణ చేద్దాం. సర్వేశ్వరు డిని చేరుకుందాం. సర్వేశ్వరానుగ్రహం పొందుదాం. నామం చేద్దాం. నామి కృపకు పాత్రులవుదాం. ఆ భగవంతుని కరుణా కటాక్ష వీక్షణాలలో మన జీవితాలను పండించుకుందాం.
(నామ స్మరణ మరికొన్ని విషయాలు మరోసారి)

– రమాప్రసాద్‌ ఆదిభట్ల 93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement