Friday, March 29, 2024

నవరాత్రి రహస్యాలు (ఆడియోతో..)

తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

అంతరం మృత్యోహే అమృతం మృత్యౌ
అమృత మాహితం
తదనంతరస్య సర్వస్య తదు
సర్వ స్యాస్య బాహ్యత: ||

ఈశావాస్య ఉపనిషత్తులోని ఈ మంత్రమునకు అర్థము మృత్యువుకు మధ్యన, మృత్యువు లోపల, మృత్యువు బయట ఈ విధంగా అన్నింటికి ముందూ వెనుక అన్నీ రూపములుగా వ్యాపించి ఉండువాడు ఆ పరమాత్మే.

పరమాత్మ కాలపురుషుడు, యజ్ఞపురుషుడు అను రెండు పేర్లతో రెండు రూపాలలో రెండింటిలోనూ వ్యాపించి ఉన్నా ఆ తత్త్వం ఒక్కటే. మొదటి పురుషతత్త్వం నిరంజనము, నిర్గుణము, శాంతము, శాశ్వతము, అభయము, పరిపూర్ణము. నిర్గుణము అనగా ప్రకృతి వలన ఏర్పడు సత్వ, రజ, స్తమో గుణాలు లేనివి. నిరంజనము అనగా అన్నింటిలోనూ ఉంటూ వాటి దోషాలు, బాధలు తనకు అంటకుండా ఉండుట, శాంతము అనగా రాగద్వేష, కష్ట సుఖ బేధభావనలు లేకుండుట.

ఇక రెండవ పురుషతత్త్వము సాంజనము, సుగుణము, అశాంతము, అశాశ్వతము, సభయము, స్వలక్షణము. ఈ రెండు తత్త్వాలు చీకటి వెలుగుల వలె పరస్పర విరుద్ధముగా ఉన్నా ఒకదానొకటి విడిచి ఉండవు. పరమాత్మ ఎల్లప్పుడూ జీవతత్త్వముతో ప్రకృతి తత్త్వముతో కలిసే ఉండును. ఈ రెండు తత్త్వాలు ఒకదానితోఒకటి ముడిపడి దేనిలో ఏమున్నాయో ఎలా పనిచేస్తున్నాయో చెప్పనలవి కాదు.

- Advertisement -

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement