Wednesday, April 24, 2024

ధ్వజస్తంభం

కురుక్షేత్ర సంగ్రామం తరు వాత అశ్వమేధ యాగాన్ని చేయాల కున్నారు పాండవులు. వారు వదిలిన యాగాశ్వాన్ని మణిపుర చేరుకుంది. ఆ రాజ్యానికి రాజు శ్రీకృష్ణుని పరమ భక్తుడు, అపర పరాక్రమవంతుడైన మయూరధ్వజుడు. అతని కుమారు డు తామ్రధ్వజుడు. అతను మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్వం వచ్చింది. తామ్రధ్వజుడు క్షత్రియ ధర్మాన్ని అనుసరిం చి పోరాడకుండా లొంగిపోకూడదని యాగాశ్వాన్ని బంధించా డు. తమ అశ్వమేధ యాగానికి అడ్డం వచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపంవచ్చింది. తమ అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ వారందరూ కలిసి తామ్రధ్వజుని ఓడించలేకపో యారు. తామ్రధ్వజుడు అశ్వా న్ని తనతోపాటు తీసుకుపోయాడు.
ధర్మరాజు కృష్ణుడు దగ్గరకి వెళ్ళి ఉపాయం సూచించమని అర్థించాడు. దానికి కృష్ణుడు, తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్నికోల్పోవడం అయ్యేపనికాదంటూ ఓ ఉపాయాన్ని సూ చించాడు. కృష్ణుడు సూచనతో వారిరువురూ బ్రా#హ్మణ వేషాల్లో మయూరధ్వజుని అంత:పురానికి చేరుకున్నారు. విప్రులిద్దరినీ మయూరధ్వజుడు సంతోషంగా ఆహ్వానించాడు.
”రాజా మేము మీ అతిథి సత్కారాలకు రాలేదు! మేం ఒక అడవిగుండా మీ రాజ్యంవైపు వస్తుండగా ఒక సిం#హం ఇతని కుమా రుడిని పట్టుకుంది. పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతుని సైతం విధించింది” అన్నాడు విప్ర వేషంలో ఉన్న కృష్ణుడు. ”చె ప్పండి! తప్పకుండా తీరుద్దాము,” అన్నాడు మయూరధ్వజుడు.
”మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్ల వాడిని విడిచిపెడతానన్నది” అన్నాడు కృష్ణుడు,ఆ మాటలకు మ యూరధ్వజుడు తొణకక ‘మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీ రం ఉపయోగపడితే అంతకంటే ఏం కావాలి.” అంటూ తన శరీ రంలో సగ భాగాన్ని కోసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు.
సేవకులు మయూరధ్వజుని ఆదేశాల ప్రకారం అతని శరీరం లోని సగభాగాన్ని ఛేదిస్తున్నారు. ఇంతలో మయూరధ్వజుని ఎడ మకంట కన్నీరు కారడాన్ని ధర్మరాజు చూశాడు. ‘రాజా! ఈ దానం ఇవ్వడం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది.’ అన్నాడు.
‘విప్రోత్తమా! దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు ఇది. నా కుడిభాగం ఎవరో ఒకరికి ఉపయోగపడిందే కానీ, ఎడమ భాగం ఏ ఉపయోగమూ లేకుండానే నాశనం అయిపోతోంది కదా అన్నదే నా ఆవేదన’ అన్నాడు మయూరధ్వజుడు.
‘మయూరధ్వజా! నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీకు ఏం కావా లో కోరుకో,’ అన్నాడు కృష్ణుడు.
‘కృష్ణా! ఈ శరీరం నశించిపోయినా కూడా, నా ఆత్మ చిర కాలం నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్ర#హంచండి’ అన్నాడు.
‘ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందూ నీ ప్రతి రూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తరువాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితా న్ని సార్థకం చేసుకుంటారు,’ అన్నాడు కృష్ణపరమాత్ముడు.
ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందరా ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దైవానికి నిలువెత్తు కీర్తిపతాక ఆ ధ్వజస్తంభం.
– డా. చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement