Saturday, April 20, 2024

ధర్మచక్రభ్రమణం సాగాలి

కాంక్షన్త: కర్మణా సిద్ధిం యజన్త ఇహ దేవతా:
క్షిప్రం హ మానుషే లోకే సిద్ధి ర్భవతి కర్మజా
మానవ లోకమున కర్మ సిద్ధి శీఘ్రముగా కలుగుచున్నది, కాబట్టి ఈ లోకమున కర్మఫల సిద్ధికోరువారు ఇంద్రాది దేవతలను సేవించుచున్నారు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత నాలుగవ అధ్యాయంలో తెలిపాడు. అ#హంకారము, కర్మ ఫలాసక్తి లేనిచో కర్మలు సంసారమును బాధింపజాలవని తెలిసి, పూర్వులగు ముముక్షువులు చిత్తశుద్ధి కోసం నిష్కామ కర్మయోగ నిష్ఠులై, జ్ఞాన ద్రష్ఠలై ఉండేవారు. ఆ ఋషి మునుల సంతానమే మనం. సనాతన ధర్మమునాచరిస్తు సత్కర్మలు మన:పూర్వకంగా చేసే భాగ్యం మనకు వంశ పారంపర్యంగా వస్తోంది. ఇతర దేశాల ప్రజలు విలాసతకు భోగాలకు ప్రాధాన్యం ఇస్తే మన భారతీయులు ధర్మాచరణకు, సత్కర్మలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ధర్మచక్రం ఎక్కడా ఆగలేదు.
కామినీ కాంచనాల మీద, భోగాల మీద, సహజంగా అభిలాష ఉంటుంది. అవి అనిత్యమైనవని మన పూర్వజులు మనకు హతోపదేశం చేసారు. పెద్దల మాట చద్దిమూట అని భావించి మనం ధర్మమార్గాన్ని ఏనాడు త్యజించలేదు. అధర్మాన్ని ఆచరిస్తే పుట్టగతులు ఉండవని దృఢంగా విశ్వసించినవారు భారతీయులే!
కొన్ని శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయి ఉన్నా ఆ ముష్కరులు మన ధర్మాన్ని దెబ్బ తీయలేక పోయారు. ధర్మగ్లాని జరిగే సందర్భాల్లో సాధుసంతులు, మహాత్ములు ఉక్కు గోడలా నిల్చుని ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ కాలఖండంలో కొన్ని దేశాలు, మతాలు ఈ దుష్క రకృత్యాలవలన నామరూపాలు లేకుండా నశించిపో యినా #హందూ దేశం, ధర్మం సురక్షితంగానే ఉన్నాయి. ”సనాతన సంస్కృతికి, అత్యుత్తమ
విజ్ఞానానికి ఆలయమైన భారతభూమియందు, జన్మించి అజ్ఞాన జీవనమందు జన్మ వృధా చేసిన వ్యక్తి ధనాదులు ఆర్జిం చినా, సంతానవంతుడైనా తన జీవన పరిణామానికి దారిని తెలుసుకొననివాడు దురదృష్టవంతుడు. ఈ భారతభూమి యం దు జన్మించి ధనాదులు లేని దరిద్రుడైనా, కష్ట జీవనాన్ని అనుభ వించినా, తనలోని జీవన రహస్యాన్ని గ్రహంచిన వాడు బహు భాగ్యశాలి” అంటారు సద్గురు శివానంద మూర్తి. ఆర్య సం స్కృతి ఒక్కటే వ్యక్తిలోని ఉన్నత గుణాలను పెంపొందింపజేస్తుంది.
కర్మ యందు మనకు విశ్వాసం ఉంది. పునర్జన్మ మీద కూడా మనకు విశ్వాసం ఉంది. ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తడానికి ముఖ్య కారణం కర్మలు చేయడానికేనని సగటు హిందువు భావిస్తాడు. ” నీవు శాస్త్రోక్త మైన నిత్య కర్మను చేయము” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. అది కేవలం అర్జునునికి బోధ కాదు, సర్వులకు చేసిన బోధ. కర్మాచరణ లేనిచో ఎవరికి శరీర యాత్ర గడువదు. ఇది కూడా శ్రీకృష్ణుని హెచ్చరికే! ”ఫలాపేక్షతో చేసిన కర్మల వలన మోక్షప్రాప్తి (ముక్తి) కలుగదు. కావున పరమేశ్వర ప్రీత్యర్థం కర్మలు చేయి” అని ఆయన నిర్దేశించాడు. సత్కర్మలే భగవంతునికి ప్రీతికొల్పుతాయంటే అందుకు వ్యతిరేకించే వారుండరు. ఒక వేళ ఎవరైనా ఉంటే వారు మూఢులూ, వ్యర్ధ జీవులు.
మనం గత జన్మల ఋణాలతో జన్మిస్తాం. గత జన్మలా? ఎప్పుడు, ఎక్కడ జన్మించేం అని ప్రశ్నించడం మూర్ఖత్వం. అర్జునుడడిగిన ఒక ప్రశ్నకు శ్రీకృష్ణపరమాత్మ ఇలా జవాబి చ్చాడు. ”అర్జునా! నీకు నాకు పెక్కు జన్మలు గడచినవి. నేను ఆ జన్మలన్నింటినీ ఎరుగుదును. నీవు వానిని ఎరుగవు. ధర్మాధర్మాది సంస్కారం వలన నీ జ్ఞానశక్తి ఆవృతమైంది” అని అంటాడు. మనం పెక్కుమందికి గత జన్మలలో ఋణపడి
ఉన్నాం. జన్మ పరంపర వలన ఋణం సంక్రమిస్తుంది. ప్రతి జన్మలోను మనకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, విద్యా గురువులు, ఉపాధి నిచ్చినవారు, అనారోగ్యానికి గురియైతే చికిత్స చేసిన వై ద్యులు, ఆపత్సమయాల్లో ఆదుకున్న మిత్రులు ఇలా ఎం దరో ఉన్నారు. శత్రు శేషం, ఋణశేషం ఉండకూడదు. ఋణశేషం ఉంటే మరొక జన్మ ఎత్త వలసిన ఉంటుంది, ముక్తి లభించదు. ఆ శేష ఋణాలను తీర్చుకునే అవకాశం భగవంతు డిచ్చిన కారణంగా ఈ కర్మ భూమిలో తిరిగి మానవులుగా జన్మించేం. భగవంతుడి కృప లేకుంటే సర్పంగానో, వృశ్చికంగానో లేదా పశువుగానో జన్మించి ఉండే వారం. గత జన్మలో పాప కార్యాలు చేసి ఉంటే మరు జన్మలో ఇలాంటి దుర్భర జన్మలే లభిస్తాయని గీతలో భగవానుడు చెప్పాడు.
”ధర్మో విశ్వస్య జగత: ప్రతిష్ఠా,
లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పన్తి,
ధర్మేణ పాపమపనుదతి
ధర్మే సర్వం ప్రతిష్ఠితమ్‌
తస్మా ధర్మం పరమం వదన్తి”
” వేద స్వరూపమగు ధర్మమే సర్వ జగత్తుకు ఆధారం. లో కంలో ప్రజలందరు ధర్మాత్మునే చేరుతారు. ధర్మం వలన పాపం నశిస్తుంది. అంతా ధర్మమునందే ప్రతిష్ఠిం పబడింది. అందు చేతనే ధర్మమును ఉత్కృష్టమై నదిగా (పరమాత్మగా) చెబుతారు.”
తైత్తరీయారణ్యకమునపై మంత్రం ఉంది. భారత భూమి లో పుట్టినవారికి శిశుప్రాయంలోనే ఉగ్గుపాలతో పాటు పట్టేవి ధర్మాచరణ, సత్క ర్మాచ రణ. భారతీ యులకు ధర్మాచరణ ఏ ఇతర మతముల వారు బోధించినది కాదు. సృష్టి జరిగినప్పుడే మన సనాతన ధర్మం పుట్టింది. అప్పటికి ఏ దేశాలు, మతాలు పురుడు పోసుకోలే దు. జ్ఞాన ద్రష్టలైన ఋషి పరం పరమ నకు ప్రసా దించిన మహూ త్కృష్టమై న ఫలం ధర్మం. యుగాలు గడు స్తున్నా ఒక తరం నుండి మరొక త రానికి గొలుసుగా వస్తున్న కారణం చేతనే ఈ ధర్మం ఈ గడ్డ మీద స్థిరంగా ఉంది. మన ధర్మచక్రం అనాది నుంచి ఒక్క క్షణం కూడాఆగకుండా తిరుగుతానే ఉంది. ధర్మచక్రం ఏ తరంలోనైనా ఆగిపోయి ఉంటే తరువాత తరాలవారికి అది అందు బాటులో ఉండేది కాదు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కూకటి వ్రేళ్ళతో పెకలించి వేయాలని విధర్మీయులు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సాధు సంతు లు ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నారు.
ధర్మాన్ని ఆచరించేవారికి, సత్కర్మలు చేసేవారికి సుఖసంతోషాలు, సంపదలు లభిస్తాయి. ఇందుకు విరుద్ధంగా మానవత్వాన్ని మరచి అక్రమాలకు పాల్పడేవారికి ఈ లోకంలోనే కష్టాల వాటిల్లుతాయి. అశాంతికి గురి అవుతారు. అలాంటి వారికి పరలోకంలో సుఖం ఎక్కడ ఉంటుంది? సాత్విక సుఖము, బుద్ధి నైర్మల్యము వలన కలుగుతుంది. రాజస తామసుల కర్మాచరణ దు:ఖ హతువే కాని సుఖశాంతులు కలిగించదు.
కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుందం టారు. అంటే కృత, త్రేతా, ద్వాపర యుగాలతో పోలిస్తే ధర్మాచరణ పరాయణులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నారని భావించ వచ్చును. అందువలన కొందరు స్వార్థంతో అధర్మమార్గాన నడుస్తూ ఉంటారు. ధనము, సంపదలు ఎవరికి ప్రీతి కాదు. అవి తాత్కాలిక సుఖాలనే ఇస్తాయి. అలాంటి వారికి శాశ్వతానందంశూన్యం.ధర్మమనగానేమి? అనే సూటి ప్రశ్న రావచ్చు. ఇంతవరకు ధర్మానికి ఇదేనని ఎవరు సరియైన నిర్వచనం ఇవ్వలేదు. అయితే ధర్మానికి ఉండవలసిన లక్షణాలను మన పూర్వులు నిర్ధారించారు.
ధృతి: క్షమా దమోస్తేయం
శౌచ మింద్రియ నిగ్రహ:
ధీర్విద్యా సత్య మక్రోధ:
దశకం ధర్మ లక్షణమ్‌
ధైర్యము, క్షమ (సహనము), మనస్సును నిగ్రహించుకొనుట, దొంగతనం చేయకుండా (అనగా అక్రమార్జన లేకుండుట), శుచి, ఇంద్రియ నిగ్రహం, బుద్ధి, ఉచితానుచిత వివేకము, విద్య, సత్యం, క్రోధరాహత్యము
ఈ పది ధర్మ లక్షణములు.
పూర్వజన్మలలో మనమెందరికో ఋణ పడి ఉండటమే కాక ఈ జన్మలో మనం తల్లిదండ్రులు, విద్యనొసగు గురువులు, మన కు ఉపాధి కల్పించినవారు, వైద్యులు (ప్రాణదాతలు), శ్రేయోభిలాషులు, కష్టాలలో మనకుఅండగా నిలిచినవారు ఇలా ఎందరి ఋణాలో తీర్చడం మన కర్తవ్యం. అంతేకాదు ఎవరు ముందు సహాయం
అర్ధిస్తారో వారికి తగిన సహాయం చేయాలి. డబ్బు ఖర్చు అవుతుందని బాధపడకుండా యథాశక్తి దానధర్మాలు చేయాలి. మనం సమాజానికి ఏ విధంగా సేవ చేసినా అది పుణ్యకార్యమే. ప్రతి పుణ్యకార్యం యజ్ఞంతో సమానం. దరిద్ర నారాయణలకు సేవచేయండి, వారిని అదుకొండి అని స్వామి వివేకానంద మనకు పిలుపు నిచ్చారు. అందువలన ఇలాంటి దు:ఖితుల కోసం కొంత డబ్బు కేటాయించాలి.
శ్రుయతాం ధర్మ సర్వస్వం
శ్రుత్వా చాప్యవ ధార్యతాం
ఆత్మన: ప్రతికూలాని
పరేషాం న సమాచరేత్‌
”ధర్మ సర్వస్వం విని, దృష్టినిడి, వ్యవహరించండి. ఇతరులు మీకు ఏమి చేయరాదనుకుంటారో దానిని మీరు
ఇతరులకు చేయవద్దు.” ఇది ఆచరణీ యమైన ఎంతో మంచి హితవ చనం. మన తరంలో ధర్మచక్రం తిరుగు తూనే ఉండాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనలను రక్షిస్తుంది.


గుమ్మా ప్రసాదరావు
97551 10398

Advertisement

తాజా వార్తలు

Advertisement