Friday, April 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)


మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
15. దానపద్ధతి
శతేషు జాయతే శూర: సహస్రేషు చ పండిత:
వక్తా శతసహస్రేషు దాతా భవతివానవా

నూరు మందిలో ఒకరు శూరుడుండును, వేయి మందిలో ఒకరు పండితుడుండును, పదివేలమందిలో ఒకరు వక్త ఉండును, కాని దాత ఉండునో లేదోనని సంశయము.

శరీర బలమును, మనోధైర్యమును కూర్చుకొనిన వాడు శూరుడు, గురువులను సేవించి విద్యాబుద్ధులను అలవరుచుకొనినవాడు పండితుడు, తాను నేర్చిన విద్యాబుద్ధులను పదిమంది కి పంచినవాడు వక్త అనబడును. శరీరముతో శ్రమను ఇతరులకిచ్చు వారుందురు, పెద్దలను సేవించి విద్యను సంపాదించువారుందురు, సంపాదించిన విద్యను పంచువారుందురు కాని సంపాదించిన ధనమును, వస్తు సంపదను పంచువారు అనగా దాత దుర్లభుడని తాత్పర్యము

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement