Thursday, April 18, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాస వైభవం-21 (ఆడియోతో)…

యధా శౌచం యధా స్నానం యధా సంధ్యాచ తర్పణమ్‌ |
అగ్నిహోత్రం యధా శ్రాద్ధం తధా వైశాఖ సత్క్రియా: ||

వైశాఖే మాధవే ధర్మాన కృత్వా నోర్థ్వగో భవేత్‌ |
న వైశాఖ సమో ధర్మో ధర్మజ్ఞానేషు విద్యతే ||

సంత్యేవ బహవో ధర్మా: ప్రజాశ్చారాజకా ఇవ |
ఉపద్రవైశ్చ లుప్యన్తి నాత్ర కార్యా విచారణా ||

సులభా: స్సకల ధర్మా: కర్తుం వైశాఖ చోదితా: |
ఉదకుంభం ప్రపాదానం పథిచ్ఛాయాది నిర్మిత: ||

ఉపానత్పాదుకా దానం ఛత్ర వ్యజనమో స్తధా |
తిలాయుక్త మధోర్దానం గోరసానాం శ్రమావహామ్‌ ||

- Advertisement -

శౌచము, స్నానము, సంధ్యాతర్పణము, అగ్నిహోత్రము, శ్రాద్ధముల వలె వైశాఖ సత్క్రియలు కూడా ఆచరించవలెను. వసంత రుతువులో వైశాఖ మాసములో ధర్మమునాచరించకుండగా ఊర్థ్వ లోకములకు వెళ్ళుట సాధ్యము కాదు. ధర్మజ్ఞానములలో వైశాఖ సమమైన ధర్మము లేదు. రాజులు లేని ప్రజల వలె చాలా ధర్మములున్నవి. అవి ఉపద్రవములచే లోపించును. వైశాఖ మాసమున విధించబడిన సకల ధర్మములు ఆచరించగలవి. ఉదకుంభము, ప్రపాదానం, దారిలో నీడ ఏర్పరచుట, పాదరక్షలు, పాదుకలను, ఛత్రమును, విసనకర్రను ఇచ్చుట, నువ్వులు-బెల్లం, నువ్వులు-తేనె ఇచ్చుట, శ్రమ తొలగించు గోరసముల దానము చేయుట శుభప్రదము.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement