Friday, March 29, 2024

ధర్మం – మర్మం : వరలక్ష్మీ వ్రత విశిష్టత (ఆడియోతో…)

వరలక్ష్మీ వ్రత విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆనాడు సువాసినులు, కన్యలు, వివాహమైనవారు, ఒకరోజు ముందుగా వ్రతమాచరిస్తామని సంకల్పించి మర్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి, అభ్యంగన స్నానమాచరించి, నూతన వ స్త్రాలను ధరించి అమ్మవారి వైభవాన్ని ప్రస్తుతించే కథలను విని, వినిపించి పంచభక్ష్యపరమాన్నములను నివేదన చేయవలెను. బ్రాహ్మణులకు, గురువులకు తమ శక్తి మేరకు వస్త్ర, ఆభరణ, దక్షిణ, తాంబూలాదులను సమర్పించి సుమంగుళులకు వాయనములు అర్పించి వారి ఆశీస్సులను పొందాలి. ఈ విధంగా చేసిన సౌభాగ్యం, సత్సంతానం, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యములు సిద్ధిస్తాయని పద్మ పురాణంలో వివరించబడింది.

నేడు శ్రావణ శుద్ధ ద్వాదశి కావున తులసీ మహాత్మ్యం విని తులసిని ఆరాధించాలి. ఈనాడు శ్రీమహావిష్ణువునకు పవిత్రారోపణ చెప్పబడిం పవిత్ర ఉత్సవంను నిర్వహిస్తారు.

……శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement