Friday, March 29, 2024

ధర్మం – మర్మం : భక్తి (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కం దాడై రామానుజాచార్యుల వారి వివరణ…

6.
నతపోభి: న వేదైశ్చ న జ్ఞానే నాపి కర్మణా
హరిర్వా సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికా:

తపస్సులతో వేదములతో జ్ఞానంతో కర్మతో శ్రీహరిని మన వశంలో చేసుకోలేము. భక్తితో మాత్రమే పరమాత్మ వశమవుతాడు. అనగా భగవంతుడిని సాధించాలి అనుకున్నవారు తపస్సు మొదలు పెడితే వేల, లక్షల సంవత్సారాలు కావాలి. అయినా సాక్షాత్కరిస్తారని నమ్మకంలేదు. భక్తిలేని తపస్సు ఫలితము ఇవ్వదు. భక్తి ఉన్నవారికి తపస్సుతో పని లేదు. అట్లే వేదాభ్యాసము కూడా భక్తి లేని నాడు వ్యర్థమే. కేవలం జ్ఞానం భక్తి రూపాన్ని పొందితేనే భగవంతుడు తెలుస్తాడు. కర్మ కూడ భక్తితో చేస్తేనే ఫలిస్తుంది. అందుకే భక్తి ఉంటే తపస్సు, వేదము, జ్ఞానము, కర్మ ఇవేమీ లేకున్నా భగవంతుడు మన వాడ వుతాడు.

కృష్ణుడిని కోరుకున్న గోపికలకి ఏ తపస్సు తెలియదు. వారు ఏ వేదాలు చదవలేదు. జ్ఞానం అస్సలు లేదు. పెద్దగా కర్మలేవి చేసి ఎరుగరు కానీ కృష్ణున్ని ప్రేమించి ఆ ప్రేమ కోసమే బ్రతికారు. కృష్ణుడు లేకుంటే నిష్టూరం ఆడారు, నిలదీశారు, తులనాడారు, అలిగారు, కలహించారు అయినా అన్నిట్లో ఆయన పై ప్రేమే కన పడింది, ఆ ప్రేమకై అంటే భక్తికే స్వామి గోపికలు చెప్పినట్టు విన్నాడు. తాను వారికి వశమై వారిని తన వశం చేసుకున్నాడు. అందుకే పరమాత్మ భక్తితోటే సాధించబడతాడు, తక్కిన వాటితో పని లేదని ఋషి హృదయం.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement