Saturday, April 20, 2024

ధర్మం – మర్మం : భక్తి (ఆడియోతో..)

శివమహాపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

విజ్ఞాన స్యచ సన్మూలం భక్తి రవ్యభిచారిణీ
జ్ఞాన స్యాపిచ సన్మూలం భక్తి రేవాభిధీయతే
భక్తి ర్మూలంచ సత్కర్మ శ్వేష్ఠ దేవాది పూజనమ్‌
తన్మూలం సద్గురు: ప్రోక్త: తన్మూల: సంగతి: సతామ్‌
సంగత్యా గురు రాప్యేత గురో: మంత్రాది పూజనమ్‌
పూజనాజ్జాయతే భక్తి: భక్త్యా జ్ఞానం ప్రజాయతే
విజ్ఞానం జాయతే జ్ఞానాత్‌ పరబ్రహ్మం ప్రకాశకమ్‌
విజ్ఞానం జాయతే యత్ర తధా భేదో నివర్తతే
భేదే నివృత్తే సకలే ద్వంద్వ దు:ఖ విహీనతా
ద్వంద్వ దు:ఖ విహీనస్తు విష్ణు రూపో ( శివ రూపో) భవిష్యతి

విజ్ఞానమునకు అసలైన మూలం ఇష్టమైన ఒకే దేవుని యందు ఉండు భక్తి. జ్ఞానమునకు మూలం కూడా భక్తే. మోక్షము యందు బుద్ధి కలుగుట జ్ఞానము అని అంటారు. సుఖంగా బ్రతకడానికి కావాల్సిన సాధనాలను సంపాదించుకొనే విధానమును తెలుసుకొనుట విజ్ఞానము అంటారు కావున జ్ఞానము, విజ్ఞానమునకు మూలం భక్తి. భ క్తి కలుగుటకు మూలం సత్కర్మ. అలాగే తనకిష్టమైన దైవాన్ని పూజించుట. అలా సత్కర్మ ఆచరించాల న్నా ఇష్ట దైవాన్ని పూజించాలన్నా దానికి మూలం సద్గురువు. చక్కని గురువు లభించాలంటే సజ్జనులతో సహవాసం కావాలి. గురువు వలన మంత్రం లభిస్తుంది. మంత్రం వలన దైవ పూజ చేస్తాము. పూజచేస్తే భక్తి కలుగుతుంది, భక్తి వలన జ్ఞానము, జ్ఞానము వలన విజ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వలన కలిగే విజ్ఞానం పరబ్రహ్మను సాక్షాత్కరింపచేస్తుంది. నిజమైన విజ్ఞానం కలిగితే నీవు – నేను, నీది – నాది అనే బేధం తొలగిపోతుంది. ఎప్పుడైతే బేధభావం తొలగిపోయిందో ఆకలిదప్పులు, లాభనష్టాలు, జయాపజ యాలు, జనన మరణాలు ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఇలా ద్వంద్వ దు:ఖం తొలగిన వారు శ్రీ మహావిష్ణువు సారూప్యాన్ని లేదా శివ సారూప్యాన్ని పొందుతారు అనగా పరబ్ర హ్మ స్వరూపాన్ని పొందుతారు అని అనవచ్చు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement