Thursday, April 25, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

నారాయణస్య పూజార్ధం చినోమిత్వాం నమోస్తుతే
కుసుమై: పారిజాతాద్యై: గంధాద్యై రపి కేశవ:
త్వయా వినా నైతి తృప్తిం చినో మిత్వాం అతశ్శుభే
త్వయా వినామహా భాగే సమస్తం కర్మ నిష్ఫలం
అతస్తు తులసీ దేవి చినోమి వరదాభవ
చయనోద్భవ దు:ఖంతే యద్దేవి హృదిజాయతే
తత్‌క్షమస్వ జగన్నాధే తులసీం త్వాం నమామ్యహం

శ్రీమన్నారాయణుని పూజ కొరకు నిన్ను తెంపుచున్నాను. నీకు నమస్కారము. కేశవుడు పారిజాతాది పుష్పములతో గంధాదులతో కూడా తృప్తిని పొందడు. నీవు లేకుండా మరిన్ని విధములుగా పూజించిననూ శ్రీహరి సంతోషించడు. కావున శుభకరురాలా! నిన్ను తెంపుచున్నాను. మహానుభావురాలా! నీవు లేనిది సకల కర్మలు నిష్ఫలాలు కావున తులసీ దేవీ! నిన్ను తెంపుచున్నాను. మాకు వరములు ఇచ్చుదానివిగా ఉండుము. తెంపుట వలన నీ హృదయమున దు:ఖము కలిగినచో జగన్నాయకి క్షమించుము. తులసీ నీకు నమస్కరించుచున్నాను.

శ్రీమహావిష్ణువు భక్తులు తులసీ వృక్షము వద్ద చేతులు జోడించి పై మంత్రమును పఠించి, రెండు సార్లు చప్పట్టు కొట్టి తులసి కొమ్మను కదపకుండా తులసీ దలమును తెంపవలెను. తులసీ దలమును తెంపినపుడు కొమ్మ విరిగినచో తులసి పతి అయిన శ్రీహరి హృదయమున వ్యధ కలుగును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement