Friday, March 29, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఇంద్రాది దేవతలు చేత భగవతి అయిన తులసి నిరంతరం సేవించదగినది. ఆ విధంగా సేవించినచో చతుర్వర్గ ఫలమును ప్రసాదించును. స్వర్గలోకమున, మర్త్య లోకమున, పాతాళ లోకమున కూడా తులసి దుర్లభమైనది. తులసి యందు భక్తి కలవారికి ధర్మార్థ కామ మోక్షములు లభించునని పద్మపురాణం ఉత్తరకాండం, ఉత్తరార్ధంలో క్రియాయోగ సారకాండంలో తులసి వైభవంలో వివరించబడినది.

ప్రభాతే తులసీం పశ్యేత్‌ భక్తిమాన్యా నరోత్తమ:
స విష్ణు సదర్శన స్యైవ ఫలం పాప్నోతి చాక్షయం
తులసీం ప్ర ణమే ద్యస్తు నరో భక్తి సమన్విత:
ఆయుర్బలం యశో విత్తం సంతతి: తస్య వర్ధతే

ప్రభాత కాలమున భక్తి కలిగిన నరులు తులసిని దర్శించుకున్నచో శ్రీమహావిష్ణువును దర్శించుకున్నంత అక్షయ ఫలము లభించును. భక్తితో తులసిని నమస్కరించినచో ఆయువు, బలము, యశస్సు, ధనము, సంతతి పెరుగును. తులసిని స్మరించినంతనే సకల పాపములు, స్పృశించినచో సకల వ్యాధులు హరించును. సకల పాపములను హరించు తులసీ పత్రమును ప్రతీ దినము భక్షించినచో శరీరములో ఉన్న వ్యాధులు, పాపములు నశించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement