Thursday, April 25, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో..)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

పర్వణ్యవసరే యస్తు శ్రావణ చాధ రోపయేత్‌
సంక్రాంతి దివసే చైవ తులసీ చాతి పుణ్యదా
తులసీం పూజయేన్‌ నిత్యం దరిద్ర: ఈశ్వరో భవేత్‌
సర్వ సిద్ధి కరా మూర్తి: కృష్ణ: కీర్తిం దదాతిచ

ప్రతీ పర్వదినమున అలాగే శ్రావణ మాసం ప్రతీ దినమున ఒక తులసీ మొక్కను నాటవలెను. అలాగే ప్రతీ సూర్యసంక్ర మణమున తులసిని నాటినచో విశేషమైన పుణ్యమును, అంతమున వైకుంఠమును ప్రసాదించును. ప్రతి నిత్యము తులసిని పూజించినవాడు దరిద్రుడైననూ సాక్షాత్తు ఈశ్వరుడే అగును. తులసీ మూర్తి సర్వ సిద్దులను ప్రాసదించును, కృష్ణుడు కీర్తిని ప్రసాదించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement