Friday, March 29, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసములో నదీ స్నానము విశిష్టత (ఆడియోతో…)

కార్తిక మాసములో నదీ స్నానము విశిష్టతగూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

కార్తిక మాసం నెల రోజులు అవకాశం, శక్తి ఉన్న వారు నదీతీర నివాసం చేయడం సర్వోత్తమం. అన్ని మాసాలలో అన్ని నియమాలలో ‘త్రి’సంధ్య స్నానం విధించబడితే కార్తిక మాసంలో ప్రతి రోజు పంచవార స్నానం విధించబడింది. సూర్యోదయం కంటే ముందు, సూర్యోదయం తరువాత వచ్చే రెండు జాములకు, సూర్యాస్తమయానికి ముందు,తరువాత స్నానమాచరించవలెను.

నదీతీర్ధే కార్తికే వ్రత పరాయణ:
సర్వపాప వినిర్ముక్త: సగచ్ఛేత్‌పరమం పదమ్‌
తీర్థే జలే సదాశ్రీశ:మధ్యాహ్నేచ మహేశ్వర
సాయంకాలే సదా బ్రహ్మా సర్వదాచ సనాతన:
నారాయణ: సమావస్తే, తీర్థ స్నానం తత: పరమ్‌

అనగా తీర్థ జలంలో త్రిమూర్తులు, త్రిసంధ్యలలో నివసిస్తారని అసలు జలము శ్రీ మహావిష్ణువు నివాసమని, అందుకే అతనిని నారాయణుడు అంటారని, నారములు అనగా జలములు అందులో ఉండేవాడు నారాయణుడు. జలమును ఆరాధించి, ఆశ్రయించి, అభిషేకించి తాము స్నానం చేసి పదిమందితో చేయించి విశేషించి కార్తిక మాసంలో సర్వ కర్మ వినిర్ముక్తులై పరమాత్మ కృపకు పాత్రులు కావలెను.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement