Thursday, April 25, 2024

ధర్మం – మర్మం : ఉత్తరం దిక్కుపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైఋతి, పశ్చిమము, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కుల అధిపతులను అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు.

వీరిలో ఉత్తరం దిక్కు అధిపతిని గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
ఉత్తర దిక్కునకు అధిపతయిన కుబేరుడు విశ్రవసుబ్రహ్మ కుమారుడు. ఇతను యక్షులకు, ధనానికి, నిధులకు అధిపతి. అష్టనిధులు, అష్టైశ ్వర్యాలు, అష్ట భోగములు కుబేరుని ఆధీనంలోనే ఉంటాయి. అంధుడు, క్షయవ్యాధిగ్రస్తుడైన కుబేరుడు పరమజ్ఞాని, మహాశాంతమూర్తి. ధనాధిపతి ధృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటే ధనాన్ని తన భోగానికే ఉపయోగిస్తాడని ఇతరులకు దానం చేయించాలనే తలంపుతోనే పరమాత్మ కుబేరుడిని వ్యాధిగ్రస్తుడుగా చేసెను. నేటికీ వ్యాధిగ్రస్తులైన ధనవంతులు తాము తినలేని, అనుభవించలేని భోగాలను పదిమందికి పంచుతారు. ధనాధిపతి అయిన కుబేరుడి ఆప్త మిత్రుడు శంకర భగవానుడు భిక్షాటన చేసినా కర్మను ఎవరూ తప్పించలేరని మైత్రి కొనసాగాలంటే మిత్రులతో ఆర్థిక సంబంధము నెరపకూడదన్న నీతి శాస్త్రాన్ని కుబేరుడు చాటాడు. లంకను ఆక్రమించడానికి రావణాసురుడు యుద్ధానికి కాలు దువ్వగా తాను ఉన్న లంకాపురిని, పుష్పకవిమానాన్ని తమ్మునికి ఇచ్చి అలకాపురికి పయనమైన భ్రాతృవాత్సల్యమూర్తి కుబేరుడు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement