Thursday, April 25, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

గంగా ఆవిర్భావ వృత్తాతంలో భాగంగా సగర పుత్రుల అశ్వ అన్వేషణ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

హయము జాడ కొరకు పరిశుద్ధులై భగవంతుని ప్రార్థించిన సగర పుత్రులకు ఆకాశమున రసాతలమున హయము బంధించబడున్నదని దైవీ వాక్కు వినరాగా రసాతలమునకు వెళ్లదలచిన వారు భూమిని తవ్విరి. సముద్రమును తవ్వుతూ లోనికి వెళ్తూండగా వారికి ఆహారము లభించక ఆకలితో పీడించబడి సముద్రము అడుగుభాగమున ఉన్న ఎండిన మట్టిని భక్షించుచు తవ్వుచూ దీక్షతో ముందుకు సాగి రసాతలమునకు చేరుకొనిరి. మహా బలయులైన సగర పుత్రుల రాక తెలుసుకున్న రాక్షసులు భయపడి రసాతలమున నివసించి ఉన్న మహా ప్రభావ సంపన్నుడైన కపిల మహర్షి సమీపమునకు వెళ్ళిరి. పూర్వ కాలము ఆహారము, నిద్రను మాని దేవతల కార్యములను సాధించి అలసిపోయిన కపిల మహర్షి తాను నిద్రించుటకు తగిన ప్రదేశమును చూడమని దేవతలను అడుగగా వారు రసాతలమును సమర్పించిరి. నిద్రకు ఉపక్రమించుచున్న కపిల మహర్షి బుద్ధిహీనులు ఎవరైనా తనను నిద్రను లేపుటకు ప్రయత్నించినచో వారు భస్మము కాగలరనగా దేవతలు అం దుకు అంగీకరించగా కపిలుడు రసాతలమున నిద్రించుటకు అంగీకరించెను. కపిల మహర్షి ప్రభావమును తెలుసుకున్న రాక్షసులు మాయతో సగర పుత్రుల వధోపాయమును ఆలోచించిరి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement