Saturday, April 20, 2024

ధర్మం – మర్మం : అన్నపూర్ణాదేవి

అన్నపూర్ణాదేవి అవతార అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

అన్నపూర్ణా దేవి
అన్నం అనగా ‘అద్యతే అత్తిచ భూతాని’ అని వ్యుత్పత్తి. అన్నం ‘బ్రహ్మేతి వ్యజానాత్‌’ అనగా అన్నమే పరమాత్మని వేదోక్తి… అన్నమే పరబ్రహ్మస్వరూపం. ‘అన్నపూర్ణ ‘ అనగా పరమాత్మతో కూడి ఉన్న అమ్మ అని అర్థం. అన్నాన్ని ప్రసాదించే తల్లి అనగా పరమాత్మను ఇచ్చు తల్లి. ఆమె తల్లి అయితే పరమాత్మ తండ్రి అనేది విశేషార్థం. నిజమైన అన్నం అనగా ‘జ్ఞానం’. ‘జ్ఞాన’మనే అన్నాన్ని ప్రసాదించే తల్లి కావున ఈమెనే ‘జ్ఞానప్రసూనాంబ’గా వ్యవహరిస్తారు. స్వర్గం, పరలోకాలు, పరలోక సుఖాలను ఇచ్చే తల్లి అన్నపూర్ణ. ‘వసు’ అనగా అన్ని రకాల సుఖాలను అందించే ఈ తల్లిని ‘వాసవి’గా కూడా వ్యవహరిస్తారు. సకల లోకాలకు అన్నం ప్రసాదించే తల్లి మరియు శంకరునికి సైతము భిక్షవేసిన తల్లి అన్నపూర్ణ. ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మ వద్దకు భిక్షకు రాగా కపట రూపాన్ని గ్రహించిన అమ్మ ఆ అసురుడిన కింద పడవేసి తన కాలి కింద తొక్కిపెట్టి అన్నార్తులకు అన్నం పెట్టే మహాతల్లి అన్నపూర్ణాదేవి. దుర్జనులకు వారి దుర్మార్గాన్ని, అజ్ఞానాన్ని, హింస అనే ఆకలిని పోగొట్టి జ్ఞానం అనే అన్నాన్ని ప్రసాదించే తల్లే ‘అన్నపూర్ణ’.

నైవేద్యం : గుడాన్నం

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement