Friday, March 29, 2024

ధర్మం – మర్మం : అధోక్షజ (ఆడియోతో…)

శ్రీమద్భాగవతంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

అమృతో దధివత్‌ సర్వై: భజ్య మానోపి సర్వదా
అధో నక్షీయతే జాతు యస్మాత్‌ తస్మాత్‌ అధోక్షజ:

క్షీర సాగరమును 33 కోట్ల మంది దేవతలు, 66 కోట్ల మంది రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని సముద్రంలో పడవేసి వాసుకిని తాడుగా చేసి వేల సంవత్సరాలు చిలికినా ఆ సముద్రము నీరు ఇంకిపోలేదు. ఎలా అమృత జలం క్షీణించదో అనంత కోటి బ్రహ్మాండములలోని అనంత కోటి జీవరాశులు నిరంతరం సేవిస్తున్నా, యాచిస్తున్నా, ప్రార్థిస్తున్నా కొందరు భక్తి ఎక్కువై నిలదీస్తున్నా నారాయణుడు తాను క్రిందికి పోడు, తన భక్తులను కిందకి పోనివ్వడు. ”అధ: నక్షీయతే ఇతి అధోక్షజ: ” ఇది అధోక్షజ నామానికి అర్థము.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement