Saturday, April 20, 2024

దేహము గురించిన యదార్థమును ఆలోచించండి

మీ ప్రయత్నాలన్నింటి తర్వాత కూడా ఒక దేహము అడ్డుగా నిలుస్తుంది. అనుకున్నప్పుడు దేహము గురించిన యథార్థమును మీ ముందు ఉంచుకోండి. మీ లోపల ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు దేహము గురించి ఆలోచిస్తున్నా లేక చూస్తున్నా కానీ మీరు మీతో ఇలా మాట్లాడుకోవాలి. ” ఈ శరీరము ఒక ఎముకల గూడు, రక్త మాంసములతో తయారు చెయ్యబడ్డ రూపము. ఇది బూటకమైనది, రోగగ్రస్థమైనది, అపవిత్రమైనది. ఇది అపవిత్రమైన తమోగుణీ పదార్థాలతో తయారయినది. కామ వాంఛ కారణంగా ఈ శరీరం పుట్టింది. ఇందులో వివిధ దశలలో రక్తం ప్రవహిస్తూ ఎన్నో గడ్డలను, అసంఖ్యాకమైన క్రిమి కీటకాలను కలిగి ఉంది. ఈ చర్మం అసహ్యకరమైన ఈ దృశ్యాలన్నింటినీ కప్పేస్తుంది కనుక మనం వాటిని చూడలేకపోతున్నాము. కనుక, కేవలం రక్త మాంసములతో తయారైన ఈ శరీరంపై వ్యామోహాన్ని పెంచుకోవడం మూర్ఖత్వమే. నాశనం కాబోయే ఈ బహూటకమైన, వికారభరితమైన శరీరంపై మనం అనవసరంగా వెర్రి పిచ్చిని పెంచుకుంటున్నాం. మనిషిని ఆకర్షించే శరీర యవ్వనపు అందాలు, అలంకారాలు అన్నీ అశాశ్వతమైనవి, పరివర్తన చెందేవి. వినాశనం కాబోయే ఈ రూపానికి నేను బానిసను కాకూడదు. నేను పరమ పవిత్రుడను, సర్వ శక్తిమంతుడను, ఆనంద సాగరుడైన పరమాత్ముని సంతానమును. నరకము నుండి ముక్తి పొంది 21 జన్మల స్వర్గ భాగ్యమును పొందాలంటే నేను ఈ జన్మలో సంపూర్ణ పవిత్రతను పాటించాలి. నా నిర్ణయ శక్తికి తెరను వేసి నా దివ్య జ్ఞానాన్ని, ఆత్మిక స్థితిని బూడిదపాలు చేసేది మాయ. నన్ను భగవంతుడి నుండి దూరంగా లాక్కొని వెళ్ళి బానిసగా చేసి బంధనాలలో ఇరికింపచేసేది మాయ. ఇకపై మాయ నాపై రాజ్యమేలడానికి నేను అవకాశమివ్వను. ఎందుకంటే ఇప్పుడు నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులలో కూడా ఆత్మను చూస్తున్నాను. ఎప్పుడో ఒకసారి నేను ఈ శరీరాన్ని వదలాల్సిందే. మరి ఇటువంటి శరీరం కోసం ఆత్మనైన నేను మంచితనం నుండి మరణించాలా?”
ఈ విధంగా మనిషి ఆలోచించినప్పుడు అతడి మనసు కామపూరిత ఆలోచనల నుండి దూరమై తనలో శక్తిని, అపారమైన శాంతిని అనుభవిస్తూ పరమానందాన్ని గ్రోలగలుగుతాడు.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement