Thursday, April 25, 2024

దేవీతత్త్వం

భువనేశ్వరి దేవి బ్రహ్మ, విష్ణు, మహశ్వరులకు సాక్షా త్కారమవుతుంది. విష్ణువు, శివుడు భువనేశ్వరిదేవి గుణగణాలను వేనోళ్ళ స్తుతిస్తారు. తర్వాత బ్రహ్మ భువ నేశ్వరీదేవిని యిలా స్తుతిస్తాడు.
”లోకధాత్రీ! వేదాలు కూడా నీ దివ్య తత్త్వాన్ని సమగ్రం గా వర్ణించలేవు. నీవే యజ్ఞ స్వరూపిణివి. యాగాలు చేసేటప్పు డు ”స్వాహా” కారంతో పిలువబడే శక్తివి నీవే. నీవొకతివే యీ ముల్లోకాలలో సర్వజ్ఞురాలివి. నీవే ఆదిశక్తివి. నీ శక్తి తోడుగా ఉండటం వలనే నేను సృష్టి చేయగలుగుతున్నాను. విష్ణువు పాలించగలుగుతున్నాడు. శివుడు సంహారం చేయగలుగు తున్నాడు.” అని దేవికి బ్రహ్మ ప్రణామాలు అర్పిస్తాడు.
ఆ తర్వాత ”నీవు పరబ్రహ్మవా? ఆదిశక్తివా? నీవు పురు షుడివా? స్త్రీవా?” అని దేవీ తత్వం మీద తనకున్న సందేహాన్ని నివృత్తి చేయమని, బ్రహ్మ దేవిని అడుగుతాడు. బ్రహ్మకు సందేహ నివృత్తి చేస్తూ, దేవి తన తత్వాన్ని యిలా చెబుతుంది.
”సత్యమైన వస్తువు ఒక్కటే. అదే బ్రహ్మం. రెండోదేదీ లేదు. ఆ పరబ్ర#హ్మని నేనే. నేనే పరబ్రహ్మం. ప్రళయ కాలంలో స్త్రీ, పురుష నపుంసక బేధాలు నాకు ఉండవు. ఈ బేధం అనేది బుద్ధ³ితో కల్పించబడినదే. అందరు దేవతలలోను నేను ఒక్క తెనే. ఎన్నో పేర్లతో వ్యవహరించబడతాను. శక్తి రూపంగా నేను అన్ని జీవులలో ప్రవేశించి, వారిని నడిపిస్తూ ఉంటాను. గౌరీ, శివా, నారసింహ, వాసవీ, వారుణీ, కౌబేరీ, బ్రా#హ్మ, వైష్ణవీ, రౌద్రీ లాంటి అన్ని రూపాలూ నావే. వారందరిలో ప్రవేశించి, వారితో అన్ని కార్యాలను చేయించేది నేనే. నీళ్ళలో చల్లదనంగా, అగ్నిలో వేడిదనంగా, సూర్యుడిలో ప్రకాశంగా నేనే ఉన్నాను. శక్తి అనే తోడు లేకపోతే విష్ణువు అణువంతైనా కదల లేడు. శివుడు అసురులను సం#హరించలేడు. బ్రహ్మా! నీవు చేసే సృష్టికి మూలం నా శక్తే అని తెలుసుకో. భూమిలో కూడా అనంతమైన శక్తిగా ఉన్నాను. నేనే లేకపోతే భూమి అణు వంత బరువును కూడా మోయలేదు. ఈ ప్రపంచం అంతా శాశ్వతం, క్షణికం, శూన్యం,నిత్యం, అహం కారయుతంలాంటి బేధాలుతో కూడి ఉంటుంది. ”అని దేవి స్వయంగా ”దేవీ తత్వాన్ని” వివరిం చిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ దేవిని ప్రార్థిద్దాం. ఆశ్రయిద్దాం. ఆ దివ్య మంగళదేవీ కరుణాకటాక్ష వీక్షణాలకు ప్రాప్తులవుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement