Wednesday, April 24, 2024

తల్లి వేదన తీర్చిన బలరామకష్ణులు

కంసుడు మరణించిన కొంత కాలం తర్వాత దేవకి బల రామకృష్ణులను పిలి చి వారితో ఇలా అంది. ”మీరు నారా యణుని అవతారము లని రుషులు చెప్పారు. వారు చెప్పిన దానిని నేను విశ్వసిస్తున్నాను. కానీ మీకు తల్లినను తలంపు నాకు సంతో షాన్ని ఇస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితము మీ గురువు సాందీ పుడు గురుదక్షిణగా తన పుత్రుని పునర్జీవింప జేయమని కోరిన ప్పుడు, మీరు యమపురికి వెళ్ళి అసాధ్యమైన కార్యమును నిర్వహించిన విషయము నేనెరుగుదును. మీ కంటే ముందు పుట్టిన పుత్రులను కంసుడు సంహరించాడు. అది తలచు కుని నేను విచారిస్తున్నాను. నేను వారిని ఒకసారి చూడటానికి మీరిద్దరు సహాయపడగలరేమో అనే ఆలోచిస్తున్నాను.
బలరామకృష్ణులు తమ యోగశక్తిచేత సుతల లోకము ప్రవే శించారు. ఆ లోకానికి బలి అధిపతి. అతడు బలరామకృష్ణులను సంతోషంగా ఆహ్వానించాడు. వాళ్ళిద్దరు బలికి బాగా తెలియడం తో సాదరంగా గౌరవించి, స్తుతించాడు. తనకు అతి ప్రియ భక్తు డైన బలి స్తుతి వాక్యాలను స్వీకరించి, శ్రీకృష్ణుడు ”నిన్ను ఒక సహా యం కోరి వచ్చాము. స్వాయంభువ మన్వంతర మందు మరీచి, వర్షల కు ఆరుగురు పుత్రులు వున్నారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు సర స్వతితో రతికేళి చేయ ప్రయత్నించాడు. అది చూసి మరీచి ఆరుగు రు పుత్రులు నవ్వారు. ఆ కారణంతో వారు అసురులుగా జన్మించ మని శాపం పొందారు. వారే హిరణ్యకశిపుని పుత్రు లుగా పుట్టారు. ఆ తర్వాత వారు దేవకికి జన్మించారు. వెంటనే వారిని కంసుడు సంహరించాడు. వారిప్పుడు నీ దగ్గర వున్నారు. చనిపోయి న తన పుత్రులను చూడాలని మా తల్లి దేవకి తపిస్తోం ది. వారిని నేను తీసుకువెళ తాను. ఆ తరువాత వారు శాపవిముక్తులై స్వర్గానికి వెళ తారు.” అన్నాడు. బలి ఆరు గురిని అప్పగించాడు. బల రామకృష్ణు లు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. వారి నామాలు స్మర, ఉద్గత, పరిష్వంగ, పతంగ, క్షద్ర భృతిఘృణి. ద్వారక చేరిన తర్వాత బల రామకృష్ణులు ఆరుగురిని దేవకి సమక్షమునకు తీసుకువెళ్ళారు.
మరణించిన తన పుత్రులను చూసి ఆమె సంతోషించింది. వారిని తన తొడపై కూచోబెట్టుకుని కన్నీటితో అభిషేకించింది. వారు శాపవిముక్తులై దేవకి వసుదేవులకు నమస్కరించి స్వర్గ లోకానికి వెళ్ళారు. ఇన్ని సంవత్సరాలుగా వారి గురించి ఆమె పడిన తపన తగ్గింది. తన పుత్రులను తిరిగి కలుసుకున్న వెంటనే వారు స్వర్గ లోకానికి వెళ్ళినా దేవకి విచారించలేదు. శ్రీ కృష్ణునికి జన్మనిచ్చే మహా భాగ్యం దేవకి వసుదేవులకు లభించింది. సాక్షా త్తు నారాయ ణునకు జన్మనిచ్చిన దేవకి యెంతటి అదృష్టవంతు రాలు. ఆమెకు ఇక విచారం ఏముంటుంది. శ్రీ కృష్ణ జననానికి ముందు బ్రహ్మది దేవతలు దేవకితో ”నీవు సాక్షాత్తు నారాయణు నికి తల్లివి కాను న్నావు. నీకు ఇదివరకు ఆదిశేషుడు జన్మించాడు. ఇప్పుడు పుట్ట బోయే శిశువు లోకరక్ష కుడు కాగలడు” అని చెప్పి ఆమెలో ఉత్సాహాన్ని నింపారు.


– కోసూరు హయగ్రీవరావు
99495 14583

Advertisement

తాజా వార్తలు

Advertisement