Friday, April 19, 2024

జీవన నాటకము – 2 (ఆడియోతో…)

ఈ జీవన నాటకంలో నాకు పాత్ర వద్దు అని ఎప్పుడూ అనద్దు. అది అసాధ్యం. ఇటువంటి విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఈ అవగాహన బాధను తొలగించి నీకు నీ పై నియంత్రణను తెస్తుంది. ఇతరులు కూడా అలా అయ్యేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. కావలసిందల్లా ఎటువం టి దృశ్యాలు, పరిస్థితులు ఎదురైనా దానికి తగ్గ ఆంతరిక స్థితి తయారు చేసుకోవడమే. స్వయంపై ఇటువంటి శ్రద్ధ అన్ని చింతలను, బాధలను తొలగిస్తుంది.

అప్పుడు అతి క్లిష్టమైన పరిస్థితులు కూడా సైడ్‌ సీన్లులాగానే కనిపిస్తాయి. అవి వస్తాయి, వెళ్తాయి. నీ మనసు హాయిగా, సంతోషంగా, శక్తిశాలిగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఇతరులతో వీటినే పంచుకుంటావు.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement