Thursday, March 28, 2024

గురు దేవో భవ

విద్యాభ్యాసం పూర్తి అయిన శిష్యుడికి గురువు ఇచ్చిన ఆదే శాల్లో ఒకటి ”ఆచార్య దేవోభవ” అనేది. (ఆచార్యు డు దైవముగా కలవాడవు కమ్ము.) అంటే ఆచార్యుని దైవంగా భావించ వలసి నది అని అర్థం. దీనికి గురువు అనే మాటని పర్యాయ పదంగా వాడుతూ ఉంటాం. స్వల్పంగా భేదంఉన్నా గురువు, ఉపా ధ్యాయుడు, ఆచార్యుడు, దేశికుడు అనే మాటలని సమానార్థ కాలుగానే నిత్యజీవితంలో వాడుతూ ఉంటాం.


”గురుర్బ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్‌ పరమ్‌ బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ:.”
అని గురువుని త్రిమూర్త్యాత్మకంగా భావించటం సనా తన భారతీయ సంప్రదాయం. సృష్టి కార్యానికి ఆ త్రిమూ ర్తులు ఎలా కారణమో శిష్యుడిలో జ్ఞాన ఆవిర్బా éవానికి, వికాసానికి, అవసరమైన దానినే ఉండేట్టుగా చేసి, అక్కర లేని దాన్ని తొలగేట్టు చేయటానికి గురువే కారణం అవుతా డు. తల్లితండ్రులు భౌతిక శరీరాన్నిచ్చి, భౌతిక అవసరా లను తీరుస్తారు. గురువు, జ్ఞానాన్నిచ్చి ఆత్మ కారకుడవు తాడు. శీలనిర్మాణం చేస్తాడు.
అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగునిచ్చే వాడు గురువు. జీవిత మార్గనిర్దేశనం చేసేవాడు దేశికుడు. దగ్గర కూర్చో పెట్టుకుని చదువు చెప్పేవాడు, చదివించే వాడు ఉపాధ్యాయుడు. వీరందరు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ద టంలో తగిన పాత్రని వ#హస్తారు. అందులోనూ ఉపనయనం (అక్షరాభ్యాసం) జరిగిన ప్పటి నుండి విద్యాబుద్ధులు, చదువు సంస్కారాలు నేర్పించిన ఆచార్యుడిది ప్రధానపాత్ర.
సనాతన ధర్మంలో గురువుకి ప్రముఖ స్థానముంది. గురువుకి మనదేశంలో ఇచ్చినంత గౌరవం మరెక్కడా కనపడదు. తల్లిలాగా ప్రేమతో ఉండటం, తప్పు చేస్తే తండ్రి లాగా దండించటం ఒక్క గురువులోనే కనపడే లక్ష ణాలు. గురువు సమీపంలో ఉంటే, తల్లి తండ్రులిద్దరూ దగ్గరఉన్నట్టే. తల్లితండ్రుల తరువాత సరిగా చెప్పాలంటే వారి కన్న
కూడా ఒక వ్యక్తి క్షేమం ఎక్కువగా కోరేది గురు వే. ఏ గురువైనా తన శిష్యుడు తన కన్న అధి
కుడుగా ఉండాలని కోరుకుంటాడు. ఎందు కంటే శిష్యుడి మీద వాత్సల్యం ఉండటం ఒక కారణం అయితే, తన శిక్షణలో చదివినవాడు తనని అధిగమిం చాడంటే తన శిక్షణ ఘనత కూడా వెల్లడవుతుంది. తనకన్న అధి కంగా ఉండటమేకాదు తనని ఓడిస్తే మరింత సంతోషిస్తాడు గురు వు. ఉత్తముడైన గురువు శిష్యుడికి గ్రంథ విజ్ఞానంతో పాటు లౌకిక జ్ఞానం కూడా కలిగేట్టు చేస్తాడు. తనని శిష్యుడు అధిగమించాలని కోరుకునే గురువు తనెక్కడ దెబ్బ తిన్నదీ, తను ఎక్కడ ఇబ్బంది పడినదీ శిష్యులకి ముందుగా చెప్పి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. ఈ గుణం మనకి నారదుడిలో కనపడుతుంది. శ్రీమద్భాగవతం ప్రారంభంలో నారదుడు తను దాసీపుత్రుడుగా ఉన్న జన్మవృత్తాంతం చెపుతాడు. తను దాసీపుత్రుడుగా జన్మించా నని చెప్పుకోటానికి సిగ్గుపడలేదు. అంతేకాదు, సాధనలో తనెక్కడ విఫలమయ్యాడో చెపుతాడు. చాలమంది సామాన్యులేకాదు, గురు స్థానంలో ఉన్నవాళ్ళు కూడా తమ వైఫల్యాలను వెల్లడించటా నికి సుముఖంగా తన వైఫల్యాన్ని చెప్పి, తస్మాత్‌ జాగ్రత! అని హెచ్చ రించిన నారదుడు ఇప్పటికీ కూడా గురుస్థా నీయుడే.
గురుగోవిందులలో ముందు ఎవరికి నమస్కరిస్తా వు అని అడిగితే కబీర్‌ ముందు గురువుకే నమస్కరిస్తా నని చెపుతాడు. దైవానికి కోపం వస్తే గురువు పరి హరించ గలడు. కాని, గురువుకి కోపం వస్తే దానికి పరిహారం ఉం డదు. అనుభవించక తప్పదు. దీనికి ఇంద్రాదులు కూడా అప వాదంకాదు. ఇంద్రుడు తాను బలిచక్రవర్తి చేతిలో ఓడిపోయి చెట్లు, పుట్టలు పట్టి పోవడానికి గురువు అనుగ్రహం కోల్పోవటమే కారణమని, బలి విజయానికి గురువు అను గ్రహం పొందటమే కారణమని, గురువు అనుగ్రహింపొందితే తిరిగి స్వర్గ రాజ్యప్రాప్తి కలుగుతుందని తెలుసుకుంటాడు.


– డా. నందివాడ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement