Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 1
శ్రీ పరమాత్మనే నమ:

అథ పంచదశోధ్యాయ:
పురుషోత్తమయోగ:

1.
శ్రీభగవాన్‌ ఉవాచ
ఊర్థ్వమూలమధశ్శాఖమ్‌
అశ్వతథం ప్రాహురవ్యయమ్‌ |
ఛందాంసి యస్య పర్ణాని
యస్తం వే స వేదవిత్‌ ||

తాత్పర్యము : పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : వ్రేళ్ళు ఊర్థ్వముగను, శాఖలఅఉ క్రిందుగను, వేదఋక్కులే ఆకులగను కలిగిన శాశ్వతమైన అశ్వథ్థవృక్షమొకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగిన వాడే వేదలముల నెరిగినవాడు.

భాష్యము : ఈ భౌతిక ప్రపంచములో మనకుండే బంధనాన్ని తల్లక్రిందులుగా ఉండే అశ్వథ్థ వృక్షములతో పోల్చి చెప్పటం జరిగినది. ఈ వృక్షపు వేర్లు అత్యున్నత లోకము వద్ద మొదలవుతాయి. ఈ వృక్షపు ఫలములు ధర్మార్థ కామ మోక్షములు. ఆకులు, వేదాలలో మానవుల పురోగతికి చెప్పిన మంత్రములు. జీవుడు ఈ వృక్షము పట్ల ఆకర్షితుడై ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకుచూ ఉండును. కొందరు వేద మంత్రాలకు ఆకర్షితులైతే మరి కొందరు వాటి ఫలములను అనుభవించుటకు ప్రయత్నించు చుందురు. ఈ విధముగా జీవుడు ఈ మోహపు వృక్షములో చిక్కుకుని పోతాడు. ఈ వృక్షము ఆధ్యాత్మిక వృక్షము యొక్క ప్రతిబింబము. ఇక్కడ మనకు కనిపించే అద్భుతమైనవన్నీ ఆధ్మాత్మిక జగత్తున ఉంటాయి, కాకపోతే అక్కడ అవి నిజ రూపములో ఉంటే ఇక్కడ వాటి ప్రతిబింబము మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ విధముగా భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచము యొక్క ప్రతిబింబము మాత్రమే ఇది ప్రతిబింబము కాబట్టి అశాశ్వతము. వేదాధ్యయనము యొక్క ఉద్దేశ్యము, కృష్ణున్ని అర్థము చేసుకోవటం ద్వారా ఈ ప్రతిబింబపు వృక్షాన్ని నరికివేసి ఆధ్యాత్మిక ప్రపంచపు అసలు వృక్షాన్ని చేరుకొనుట. కాబట్టి కృష్ణ చైతన్య వంతుడు, భగవద్భక్తిలో నియుక్తుడై ఉన్నవాడు వేదాలను అర్థము చేసుకున్నట్లే లెక్క.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement