Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 15
15.
రజసి ప్రలయం గత్వా
కర్మసంగిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి
మూఢయోనిషు జాయతే ||

తాత్పర్యము : రజోగుణము నందుండి మరణించినవాడు కామ్యకర్మరతుల యందు జన్మించును. తమో గుణము నందుండి మరణించినవాడు జంతుజాలమున జన్మించును.

భాష్యము : కొంతమంది మానవ జన్మ వచ్చిన తరువాత, మరి జంతు జన్మకు దిగజారే అవకాశమే లేదని భావించుదురు. కాని ఈ శ్లోకమును బ ట్టి తమోగుణములో ఉన్నవారు జంతుజన్మను పొందుతారని స్పష్టమగుచున్నది. మరలా వారు క్రమేణా ఎదుగుతూ వచ్చి ఎన్నో జంతు జన్మల తరువాత మానవ జన్మను పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మానవ జన్మను నిర్లక్ష్యము చేయక సత్సాంగత్యమును ఎంచుకుని త్రిగుణములకు అతీతులై జీవిత లక్ష్యాన్ని సాధించవలెను. లేదంటే మరలా మానవ జన్మ వస్తుందనే గ్యారెంటీ లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement