Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 14
14.
యదా సత్త్వే ప్రవృద్ధే తు
ప్రలయం యాతి దేహభృత్‌ |
తదోత్తమవిదాం లోకాన్‌
అమలాన్‌ ప్రతిపద్యతే ||

తాత్పర్యము : సత్త్వ గుణము నందుండి మరణించినవాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్రలోకములను పొందును.

భాష్యము : సత్త్వ గుణములో మరణించిన వారు ఉన్నత లోకాలైన బ్రహ్మలోకము, జనలోకములకు చేరి దేవతా సౌఖ్యాలను అనుభవించుదురు. ఇక్కడ ‘అమలాన్‌’ అనగా రజో తమో గుణము లేనటువంటిది. భౌతిక ప్రపంచము కలుషితమైనదే అయినా సత్త్వ గుణము ఉన్నవాటిలో ఉత్తమమైనది. అందువలన అమలమైనదిగా సంభోదింపబడినది. ఇలా వేరు వేరు జీవరాశులకు వేరు వేరు లోకాలు ఇవ్వబడినవి. సత్త్వ గుణములో చనిపోయినవారు గొప్ప మహర్షుల, భక్తుల జీవించే లోకాలకు ఉద్ధరించబడతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement