Friday, March 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 8
8.
తమస్త్వజ్ఞానజం విద్ధి
మోహనం సర్వదేహినామ్‌ |
ప్రమాదాలస్యనిద్రాభి:
తన్నిబధ్నాతి భారత ||

తాత్పర్యము : ఓ భరతవంశీయుడా! ఆజ్ఞానము వలన పుట్టిన తమోగుణము ఎల్లదేహధారులకు మోహకారణమని యెరుంగుము. జీవుని బంధించునటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర యనునవి ఈ తమోగుణపు ఫలములై యున్నవి.

భాష్యము : ఈ శ్లోకములో ‘తు’ అను పదమును చేర్చుటచే తమోగుణములో నున్నవారి ప్రత్యేకతను నొక్కి చెప్పటమైనది. ఇది సత్త్వ గుణమునకు విరుద్ధము. సత్త్వ గుణములో ఉన్నవారు యదార్థమును చూడగలుగుతారు. కానీ తమో గుణములో ఉన్నవారు వాస్తవాన్ని చూడలేరు. వారు పిచ్చి పట్టినవారి వలే ప్రవర్తిస్తారు. తమ తాత ముత్తాతలు, తండ్రులు, చివరికి తమ పిల్లలూ చనిపోవుటను చూసి కూడా ఈ శరీరము అశ్వాశ్వతమని అర్థము చేసుకోలేరు. ఎంతో కష్టించి పనిచేసి కూడబెట్టుచుందురు. ప్రతి వ్యక్తి చనిపోవలసి వచ్చునని వారి ఊహకు కూడా అందదు. అట్టి వారు సోమరితనము వలన సత్సాంగత్యమునకు విముఖముగా ఉందురు. వారు పది గంటలు పైగా నిద్రించుచూ ఎప్పుడూ నిరుత్సాహముగాను, మత్తు, మద్యమునకు బానిసలై ఉందురు. ఇవే తమో గుణములో బంధీ అయి ఉండు వ్యక్తి లక్షణములు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement