Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 21
21
కార్యకరణకర్తృత్వే
హేతు: ప్రకృతిరుచ్యతే |
పురుష: సుఖదు:ఖానాం
భోక్తృత్వే హేతురుచ్యతే ||

తాత్పర్యము : భౌతిక, కార్య, కారణములన్నింటికి ప్రకృతియే హేతువనియు, జగమునందలి పలు సుఖదు:ఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది.

భాష్యము : పూర్వపు కోరికలను కర్మలను బట్టి భౌతిక ప్రకృతి జీవరాశులకు తగిన శరీరములను, ఇంద్రియములను ప్రసాదించును. జీవుడు తనకు ఇచ్చిన శరీరముతో, ఈ భౌతిక ప్రకృతితో నిర్వహించే తీరును బట్టి సుఖ దు:ఖాలను పొందుతూ ఉంటాడు. జీవుడు భౌతిక ప్రకృతిని తన ఆధీనములోనికి తీసుకోవాలని ప్రయత్నించుట వలన ప్రకృతి నియమాలు అతనిపై ప్రభావము చూపుట మొదలుపెడతాయి. ఉదాహరణకు పంది శరీరము ఇవ్వబడినట్లయితే మలము భుజింపక తప్పదు. అలాగే దేవతా శరీరము ఇవ్వబడినట్లయితే ఆ శరీరమునకు తగినట్లు సదుపాయాలు కూడా ఇవ్వబడతాయి. అయితే పరమాత్మ మాత్రము ఎంత కరుణను కలిగి ఉంటాడంటే అన్ని సందర్భాలలోనూ మరియు జన్మలలోనూ ఆత్మవెంబడే ఉండి, ఎప్పుడు తనను గుర్తించి తనవైపుకు తిరుగుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement