Friday, April 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 19
19
ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసత: |
మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే ||

తాత్పర్యము : ఈ విధముగా క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చు నాచే సంక్షేపముగా చెప్పబడినది. కేవలము నా భక్తులే దీనిని పూర్తిగా అవగాహనము చేసికొని నన్ను పొందగలరు.

భాష్యము : ఇప్పటి వరకూఈ అధ్యాయమున 6,7 శ్లోకాలలో శరీరము, భౌతిక జగత్తునకు కారణమగు భౌతిక మూలకాల గురించి, మరియు 8 నుండి 12వ శ్లోకము నందు ఆత్మ పరమాత్మలను తెలుసుకొను జ్ఞాన మార్గమును, మరియు 13వ శ్లోకము నుండి 18వ శ్లోకము వరకు ఆత్మపరమాత్మల గురించి వివరించటము జరిగినది. కాబట్టి ఈ మూడు అంశాలైన క్షేత్రము, ఇరువురు క్షేత్రజ్ఞులు మరియు వారిని అర్ధము చేసుకొనుటను, కలిపి ‘విజ్ఞానము’ అందురు. అయితే జ్ఞానము అంటే జీవుడు తన బద్ధ స్థితిని తెలుసుకొని తన భౌతిక చైతన్యమును భగవత్‌ చైతన్యమును ఉద్ధరించుకొనుట. అనగా జ్ఞానమనేది భగవద్భక్తి యొక్క ప్రాథమిక అవగాహన. అయితే ఇక్కడ స్వయముగా భగవంతుడే తెలియజేస్తున్నట్లు కేవలము భక్తులు మాత్రమే ఈ జ్ఞానమును పరిపూర్ణముగా అర్ధము చేసుకోగలుగుతారు. అనగా భగవద్గీతా బోధనల ుండి భక్తులు మాత్రమే పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారే గాని మిగిలినవారు పొందలేరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement